NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

AP CID Case : హైకోర్టును ఆశ్రయించిన చంద్రబాబు

AP CID Case : అమరావతి రాజధాని అసైన్డ్ భూముల వ్యవహారంలో వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదుపై గత ముఖ్యమంత్రి చంద్రబాబు, నాటి మంత్రి నారాయణ తదితరులపై ఏపి సీఐడి కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసు పై విచారణకు హజరుకావాలంటూ సీఐడీ చంద్రబాబు, నారాయణలకు నోటీసులు జారీ చేసింది. సీఐడీ నోటీసులపై విచారణకు హజరు కావాలా వద్దా, కోర్టులో పిటిషన్ దాఖలు చేయాలా అన్న అంశంపై పలువురు సీనియర్ న్యాయవాదులతో చర్చించిన చంద్రబాబు కోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని నిర్ణయానికి వచ్చారు. ఈ నేపథ్యంలో గురువారం చంద్రబాబు, నారాయణ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. సిఐడీ ఎఫ్ఐఆర్ రద్దు చేయాలని వీరి తరుపు న్యాయవాదులు పిటిషన్ లో కోరారు. ఈ పిటిషన్ లపై రేపు హైకోర్టులో విచారణ జరిగే అవకాశం ఉంది.

AP CID Case Chandra babu approached high court
AP CID Case Chandra babu approached high court

ఎమ్మెల్యే ఆర్కే ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా చంద్రబాబు, నారాయణలపై ఐపీసీ 166,167,217, 120(బీ), రెడ్ విత్ 34, 35,36,37, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ సెక్షన్ 3(1) (ఎఫ్),(జీ), ఏపి అసైన్డ్ భూముల బదిలీ నిరోధక చట్టంలోని సెక్షన్ 7 కింద సీఐడీ కేసులు నమోదు చేసింది. ఈ నెల 23వ తేదీ ఉదయం 11గంటలకు విజయవాడలోని సీఐడీ ప్రాంతీయ కార్యాలయానికి విచారణకు రావాలని చంద్రబాబుకు సీఐడి డిఎస్పీ ఎ లక్ష్మీనారాయణ పేరుతో నోటీసులు జారీ అయ్యాయి.

చంద్రబాబుకు నోటీసులు ఇవ్వడంపై టీడీపీ నేతలు అధికార వైసీపీపై తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారు. ఇది కక్షసాధింపు చర్యలే అంటూ ఆరోపిస్తున్నారు. దీనిపై వైసీపీ నేతలు ప్రతివిమర్శలు చేస్తున్నారు. తప్పు చేయనప్పుడు విచారణకు భయపడాల్సిన అవసరం ఎందుకని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణలు కోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేయడంతో కోర్టు విచారణలో ఏం చెబుతుంది అన్నదానిపై రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

author avatar
sharma somaraju Content Editor

Related posts

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!

నెల్లూరు సిటీ: ఇక్క‌డ గెలిచే రారాజు ఎవ‌రు… కిరీటం ఎవ‌రికి..?

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N