మార్గదర్శి మేనేజర్ లు, కార్యాలయాలపై ఇవేళ ఉదయం ఏపీ సీఐడీ అధికారులు సోదాలు జరిపిన సంగతి తెలిసిందే. సోదాల అనంతరం కీలక పరిణామం చోటుచేసుకుంది. మార్గదర్శి చైర్మన్, ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావుపై సీఐడీ కేసు నమోదు చేసింది. మార్గదర్శి ఎండీ శైలజ, సంబంధిత బ్రాంచ్ మేనేజర్లపైనా సీఐడీ కేసు నమోదు చేసింది. సెక్షన్ 120 బీ, 409, 420, 477(ఎ) రెడ్ విత్ 34 ఆఫ్ ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదైంది. సెక్షన్ 5, ఏపి ప్రొటెక్షన్ ఆఫ్ డిపాజిటర్ ఇన్ ఫైనాన్షియర్ ఎస్టాబ్లిష్‌మెంట్ చట్టం కింద కేసు నమోదు చేసింది ఏబీ సీఐడీ. ఏ 1 గా చెరుకూరి రామోజీరావు, ఏ 2 గా చెరుకూరి శైలజ, ఏ 3 గా సంబంధిత బ్రాంచి మేనేజర్ లను సీఐడీ పేర్కొన్నది. విశాఖ, కాకినాడ, ఏలూరు, విజయవాడ, గుంటూరు, పల్నాడు, కర్నూలు, అనంతపురం చిట్స్ అసిస్టెంట్ రిజిస్ట్రార్ లు సీఐడీకి ఫిర్యాదు చేయగా, 1982 చిట్ ఫండ్ చట్టం ప్రకారం కేసు నమోదు చేసినట్లుగా మీడియాకు ప్రెస్ నోట్ ద్వారా తెలియచేసింది సీఐడీ.

తమ సోదాల్లో మార్గదర్శి అధికారులు, సిబ్బంది విచారణకు సహకరించలేదని పేర్కొంది. సోదాల్ల మార్గదర్శిలో అనేక అవకతవకలు, నిబంధనల ఉల్లంఘనలు జరిగినట్లు గుర్తించినట్లు సీఐడీ పోలీసులు తెలిపారు. చిట్స్ కట్టే అనేక మందికి వాయిదాలను సక్రమంగా చెల్లించకపోవడాన్ని గుర్తించామని అధికారులు తెలిపారు. ఖాతాదారులు ఇచ్చే మొత్తాన్ని నిబంధనలకు విరుద్దంగా కార్పోరేట్ ఆఫీస్ ఖాతాలకు బదిలీ చేయడం గుర్తించడం జరిగిందన్నారు. చిట్ ఫండ్ చట్టంలోని సెక్షన్ 24 రూల్ 28 ప్రకారం ఆదయం మరియు వ్యయ ఖాతా మరియు ఆస్తులు, అప్పులు స్టేట్ మెంట్ తో పాటు పెట్టుబడి వివరాలను బహిర్గతం చేయలేదని సీఐడీ పోలీసులు పేర్కొన్నారు.
బ్రాంచ్ నుండి చిట్ ఫండ్ సంస్ఓథల నుండి సేకరించిన మొత్తాన్ని నిబంధనలకు విరుద్దంగా కార్పోరేట్ కార్యాలయానికి బదిలీ చేస్తున్నారన్నారు. ఈ మొత్తాలను క్యాపిటల్ మార్కెట్ రిస్క్ లపై ఆధారపడి ఉండే మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెడుతున్నారని కనుగొన్నట్లు సీఐడీ అధికారులు తమ విచారణ నివేదికలో పేర్కొన్నారు. చిట్ ల వారీగా బ్యాలెన్స్ షీట్ మరియు లాభ నష్టాల స్టేట్ మెంట్ లు నిర్వహించడం లేదన్నారు. తమ తనిఖీల్లో కొందరు అధికారుల సహకరించలేదనీ, మరి కొందరు పరారీలో ఉన్నారని సీఐడీ అధికారులు పేర్కొన్నారు.
రామోజీరావుపై నమోదు అయిన ఎఫ్ఐఆర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2053002230002
బీఆర్ఎస్ మహిళా నేతల నిరసన .. రాజ్ భవన్ వద్ద ఉద్రిక్తత