ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారంపై స్పందించిన ఏపీ సీఐడీ .. ఫోరెన్సిక్ రిపోర్టుపై డీజీ ఇచ్చిన క్లారిటీ ఇది

Share

గత కొద్ది రోజులుగా వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటలు యుద్దం జరుగుతోంది. అది మార్ఫింగ్ వీడియో అని వైసీపీ నేతలు చెబుతుండగా, అది ఒరిజనల్ యేనని, అమెరికాలోని ఓ ల్యాబ్ మార్ఫింగ్ జరగలేదని పేర్కొన్నట్లుగా ఓ రిపోర్టును టీడీపీ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో గురువారం ఈ వ్యవహారంపై ఏపీ సీఐడీ డీజీ సునీల్ కుమార్ స్పందించారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..టీడీపీ విడుదల చేసిన ఫొరెన్సిక్ రిపోర్టులో వాస్తవాలు లేవని ఆయన అన్నారు.

 

అది ఇద్దరి మధ్య జరిగిన వీడియో కాల్ అని, దానిపై కొందరు ఫొరెన్సిక్ రిపోర్టు అని విడుదల చేశారని చెప్పారు. అసలు ఆ వీడియోను ఎవరు షూట్ చేశారు అనేది తెలియదన్నారు. మూడో వ్యక్తి షూట్ చేసిన వీడియోను ఫొరెన్సిక్ ల్యాబ్ కు పంపి రిపోర్టు తీసుకున్నారని తెలిపారు. వీడియో కంటెంట్ ఒరిజినలా కాదా అనేది ల్యాబ్ రిపోర్టులో పేర్కొనలేదన్నారు. రిపోర్టును మార్చి ప్రచారం చేశారని వెల్లడించారు. సదరు ఫొరెన్సిక్ ల్యాబ్ నుండి వివరణ తీసుకున్నామని చెప్పారు. ప్రైవేటు ల్యాబ్ లు ఇచ్చే రిపోర్టులకు విలువ ఉండదని పేర్కొన్నారు సునీల్ కుమార్.

ప్రభుత్వ ఫొరెన్సిక్ ల్యాబ్ ఇచ్చే నివేదికే ప్రామాణికం అని సీడీఐ చీఫ్ పేర్కొన్నారు. ఒరిజినల్ పుటేజ్ దొరికినప్పుడు మాత్రమే ముందుకు వెళ్లగలమని ఆయన స్పష్టం చేశారు. వీడియో తనది కాదని ఎంపి గోరంట్ల మాధవ్ చెప్పారనీ, మార్ఫింగ్ చేశారని ఎంపి ఫిర్యాదు చేశారని ఆయన తెలిపారు. దీనిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని సీఐడీ డీజీ సునీల్ కుమార్ చెప్పారు.

ఆర్కే సినీ మాక్స్ లో ప్రమాదం .. 15 మంది విద్యార్ధులకు గాయాలు


Share

Related posts

ముంబైలో సైలెంట్ గా పెళ్లి చేసుకున్న సౌత్ ఇండియా టాప్ డైరెక్టర్..??

sekhar

Today Gold Rate: 9 రోజుల్లో 2,310 తగ్గిన బంగారం ధరలు..!! నేటి రేట్లు ఇలా..!!

bharani jella

చైనా రికార్డు అధిగమించాం : బాబు

somaraju sharma