ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP CID FIR On Chandrababu: ఏ 1 చంద్రబాబు, ఏ 2 నారాయణగా ఏపి సీఐడీ మరో కేసు నమోదు

Share

AP CID FIR On Chandrababu: టీడీపీ మాజీ మంత్రి, నారాయణ సంస్థల అధినేత నారాయణను ఏపి సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకుని చిత్తూరుకు తరలిస్తున్న సంగతి తెలిసిందే. పదవ తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీ అభియోగాలపై నారాయణపై చిత్తూరు జిల్లాలో కేసు నమోదు అయ్యింది. తాజాగా ఆయనపై మరో కేసు నమోదు అయ్యింది. రాజధాని అమరావతి మాస్టర్ ప్లాన్, ఇన్నర్ రింగ్ రోడ్డు డిజైన్లలో అక్రమాలు జరిగాయని పేర్కొంటూ మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఏపి సీఐడీ అధికారులకు ఫిర్యాదు చేశారు.

AP CID FIR On Chandrababu and narayana
AP CID FIR On Chandrababu and narayana

 

Read More: Big Breaking: ఏపి సీఐడీ అదుపులో మాజీ మంత్రి నారాయణ..! ఎందుకంటే..?

AP CID FIR On Chandrababu: చంద్రబాబుతో సహా 14 మంది వ్యక్తులు సంస్థలపై

ఈ ఫిర్యాదు మేరకు ఏపి సీఐడి అధికారులు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణతో సహా మరి కొందరిపై కేసు నమోదు చేశారు. లింగమనేని రమేష్, లింగమనేని వెంకట సూర్యరాజశేఖర్, ఎల్ఈపీఎల్ ప్రాజెక్ట్స్, రామకృష్ణ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ అంజనీకుమార్, హెరిటేజ్ ఫుడ్స్ తో పాటు మరి కొన్ని సంస్థలు, ప్రభుత్వ, ప్రైవేటు వ్యక్తులపై మంగళగిరి సీఐడీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇన్నర్ రింగ్ రోడ్డులో అక్రమాలు జరిగాయని గత నెల 27వ తేదీన ఆళ్ల రామకృష్ణారెడ్డి సిఐడీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు ఈ నెల 9వ తేదీ (సోమవారం) వారిపై ఐపీసీ సెక్షన్ 120 బి, 420, 34,35,36.37,116,167,217 సెక్షన్ లతో పాటు అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 13(2) రెడ్ విత్ 13(1)(ఏ) కింద కేసు నమోదు చేశారు.

Mangalagiri: Lokesh Political Strategy Mangalagiri Ground Report

Read More: Viveka Case: వివేకా కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులకు షాక్‌ల మీద షాక్ లు..! మొన్న కేసు నమోదు..తాజాగా బెదిరింపులు


Share

Related posts

Deepika Pilli : ఢీ షోలో సోషల్ మీడియా స్టార్ దీపికా పిల్లిని ఓ రేంజ్ లో ఆడుకున్నారుగా?

Varun G

Corona: క‌రోనా టైంలో ఒక్కొక్క‌రుగా మోడీని భ‌లే బుక్ చేస్తున్నారుగా

sridhar

ఊహించని పరిణామం: కాంగ్రెస్ కు “పరోక్ష బలం.. ప్రత్యక్ష వరం” అవుతున్న వైఎస్ జగన్!

CMR
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar