టీడీపీ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు కుమారుడు చింతకాయల విజయ్ కు ఏపీ సీఐడీ మరో సారి నోటీసులు జారీ చేసింది. రాజమండ్రి సీఐడీ పోలీసులు నర్సీపట్నంలోని విజయ్ ఇంటికి వెళ్లి నోటీసులు అందజేశారు. ఈ నెల 28న గుంటూరు సీఐడీ కార్యాలయానికి విచారణకు హజరుకావాలని నోటీసులో పేర్కొన్నారు. సోషల్ మీడియా పోస్టుల వ్యవహారంలో ఈ నోటీసులు అందించారు. సీఐడీ అధికారులు వెళ్లిన సయమంలో విజయ్ ఇంట్లో లేకపోవడంతో ఆయన తండ్రి అయ్యన్నపాత్రుడికి నోటీసు అందించారు.

సోషల్ మీడియాలో సీఎం జగన్ సతీమణిపై దుష్ప్రచారం చేశారన్న అభియోగంతో విజయ్ పై సీఐడీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇంతకు ముందు ఒక సారి సీఐడీ విచారణకు విజయ్ హజరైయ్యారు. ఇప్పుడు మరో సారి ఆయన నోటీసుల జారీ చేయడం హాట్ టాపిక్ అయ్యింది. సీఐడీ నోటీసులపై అయ్యన్నపాత్రుడు స్పందిస్తూ.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేక బీసీలపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. అధికారంలో ఇంకెన్నాళ్లు బీసీల గొంతు నొక్కుతారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏపి పొదుపు సంఘాలు దేశానికే రోల్ మోడల్ గా నిలుస్తున్నాయన్న సీఎం జగన్