మార్గదర్శి చిట్ ఫండ్ కేసులో ఏపీ సీఐడీ అధికారులు సోమవారం ఆ సంస్థ చైర్మన్ రామోజీరావును విచారించారు. దాదాపు 8 గంటల పాటు ఆయనను విచారించినట్లు గా తెలుస్తొంది. సీఐడీ ఎస్పీ అమిత్ బర్దర్ ఆధ్వర్యంలో లీగల్ అడ్వైజర్ ల సమక్షంలో విచారణ కొసాగింది. గత నెలలోనే రామోజీరావు , శైలజా కిరణ్ లకు ఏపీ సీఐడీ విచారణ కోసం ఇంటి వద్ద గానీ, ఆఫీసుల్లో గానీ అందుబాటులో ఉండాలంటూ నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసింది. ఈ క్రమంలో భాగంగా ఇవేళ ఏపి సీఐడీ బృందం హైదరాబాద్ జూబ్లిహిల్స్ లోని శైలజా కిరణ్ నివాసానికి వెళ్లింది. అక్కడే రామోజీరావును సీఐడీ అధికారులు విచారణ చేశారు. ఈ విచారణలో కీలక సమాచారాన్ని సేకరించారన్న ప్రచారం జరుగుతోంది.

మరోసారి రామోజీరావును విచారణ చేయాల్సి ఉందని అధికారులు తెలిపారు. శైలజా కిరణ్ ను ఈ నెల 6వ తేదీన విచారణ జరుపుతామని చెప్పారు. ఈ మేరకు 160 సీఆర్ పీసీ నోటీసులు ఇవ్వడం జరిగిందన్నారు. ఇంతకు ముందు ఏపిలోని పలు మార్గదర్శి చిట్ ఫండ్ కార్యాలయాల్లో తనిఖీలు చేసిన ఏపీ సీబీఐ అధికారులు నలుగురు బ్రాంచ్ మేనేజర్ లను అరెస్టు చేశారు. చిట్ ఫండ్ చట్టానికి విరుద్దంగా చందాదారుల సొమ్మును మ్యూచువల్ పండ్స్, షేర్ మార్కెట్లలో పెట్టుబడులుగా పెట్టడం, ఆర్ బీఐ నిబంధనలకు విరుద్దంగా డిపాజిట్లు సేకరించినట్లుగా ఏపీ సీఐడీ అభియోగాలు మోపింది.
కీలక ప్రతిపాదనకు జగన్ సర్కార్ ఆమోదం..అమరావతి రాజధాని ప్రాంతంలో వారికి ఇళ్ల పట్టాలు