రాజధాని అమరావతి భూ కుంభకోణం కేసులో ఏపీ సీఐడీ దూకుడు పెంచింది. ఈ కేసులో టీడీపీ నేత, మాజీ మంత్రి నారాయణకు ఏపీ సీఐడీ నోటీసులు జారీ చేసింది. 41ఏ సీఆర్పీసీ కింద సీఐడీ నోటీసులు ఇచ్చింది. మార్చి 6న విచారణకు రావాలని సీఐడీ నోటీసులో పేర్కొంది. నారాయణతో పాటు ఉద్యోగి ప్రమీల, రామకృష్ణ హౌసింగ్ ఎండీ అంజనీకుమార్, నారాయణ కుమార్తెలు సింధూర, అల్లుడు పునీత్, వరుణ్ లకు సీఐడీ నోటీసులు జారీ చేసింది. నారాయణ కుమార్తెలు మార్చి 7న విచారణకు రావాలని సీఐడీ నోటీసులో పేర్కొంది.

అమరావతి రాజధాని ప్రాంతంలో గత టీడీపీ హయాంలో బ్లాక్ మనీతో బినామీ పేర్లతో భూములు కొనుగోలు చేశారన్న ఆరోపణలు నారాయణపై ఉన్నాయి. అసైన్డ్ భూములను సిబ్బంది, పని మనుషుల పేరుతో కొనుగోలు చేసినట్లుగా పలు ఆధారాలను సీఐడీ సేకరించింది. బ్లాక్ మనీ ద్వారా భూముల కొనుగోలునకు ఎన్‌స్పైర అనే షెల్ కంపెనీని వాడుకున్నట్లుగా గుర్తించారు. రీసెంట్ గా ఏపీ సీఐడీ అధికారులు నారాయణ కుమార్తె నివాసాలతో పాటు ఆయన నివాసంలో సోదాలు జరిపింది. పలు కీలక డాక్యుమెంట్ లు స్వాధీనం చేసుకున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. సోదాలు జరిపిన మూడు రోజుల వ్యవధిలోనే నారాయణ, ఆయనకు సంబంధించిన వారికి సీఐడీ నోటీసులు జారీ చేయడం విశేషం.
చంద్రబాబు చేయని ఆ పని జగన్ చేశారు .. అది ఏమిటంటే..?