మార్గదర్శి చిట్ ఫండ్ కేసులో మరో కీలక పరిణామానికి తెరలేపింది ఏపీ సీఐడీ. మార్గదర్శి ఎండీ శైలజను గురువారం దాదాపు 8 గంటలకు పైగా విచారణ చేసిన సీఐడీ అధికారులు ఆమెకు మరో నోటీసు జారీ చేశారు. ఈ నెల 13న విచారణకు అమరావతి సీఐడీ కార్యాలయానికి హజరుకావాలని ఆదేశించింది. సీఐడీ ఎస్పీ నేతృత్వంలోని అధికారులు బృందం గురువారం జూబ్లిహిల్స్ లోని శైలజ కిరణ్ నివాసానికి వెళ్లి ఆమె నుండి స్టేట్ మెంట్ రికార్డు చేసింది. విచారణ ప్రక్రియను వీడియో రికార్డింగ్ చేశారు. రెండు రోజుల క్రితం ఈ కేసులోనే రామోజీరావును సీఐడీ అధికారులు ప్రశ్నించారు. తాజాగా శైలజా కిరణ్ కు నోటీసులు జారీ చేసిన సీఐడీ అధికారులు.. అవసరమైతే రామోజీరావును విచారిస్తామని, అయన కూడా సీఐడీ కార్యాలయానికి రావాల్సి ఉంటుందని తెలిపారు.

Breaking: బీజేపీ నేత బండి సంజయ్ కు ఊరట .. షరతులతో బెయిల్ మంజూరు
మార్గదర్శి చిట్ ఫండ్ కేంద్ర చిట్ ఫండ్ చట్టం – 1982 కు విరుద్దంగా చందాదారుల నుండి సేకరించిన సొమ్మును మ్యూచువల్ ఫండ్, షేర్ మార్కెట్ లో పెట్టుబడిగా పెట్టడం, రిజర్వు బ్యాంకు నిబంధనలకు విరుద్దంగా అక్రమ డిపాజిట్ల సేకరణపై సీఐడీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ కేసులో ఏ 3 గా ఉన్న కొందరు మార్గదర్శి చిట్ ఫండ్ బ్రాంచి మేనేజర్ లను సీఐడీ అరెస్టు చేసింది. కాగా తాజా నోటీసులపై మార్గదర్శి యాజమాన్యం మరో సారి హైకోర్టును ఆశ్రయించే అవకాశం ఉందని తెలుస్తొంది. ఇంతకు ముందు ఈ కేసులో తెలంగాణ హైకోర్టును మార్గదర్శి యాజమాన్యం ఆశ్రయించగా మద్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
Breaking: ఏపిలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీ