సోషల్ మీడియా పోస్టుల వ్యవహారంపై ఐటీడీపీ ఇన్ చార్జి చింతకాయల విజయ్ సీఐడీ విచారణ ముగిసింది. ఏపీ సీఐడీ అధికారుల ముందు విజయ్ రెండో సారి విచారణకు హజరైయ్యారు. దాదాపు ఏడు గంటల పాటు విజయ్ ను సీఐడీ అధికారులు ప్రశ్నించారు. విచారణ అనంతరం చింతకాయ విజయ్ మాట్లాడుతూ రెండో సారి కూడా విచారణకు వెళ్లానని తెలిపారు. సీఐడీ అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పానని వివరించారు.

గత విచారణలో చంద్రబాబు, లోకేష్ అంశాలు ఎక్కువగా అడిగారని అయితే ఇవేళ కేసుకు సంబంధించిన ప్రశ్నలు మాత్రమే అడిగారని విజయ్ తెలిపారు. గతంలో ఏపీ సీఐడీ అధికారులు హైదరాబాద్ లోని ఆయన నివాసానికి వెళ్లి నోటీసులు అందడజేయడం తీవ్ర వివాదాస్పదం అయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత సీఐడీ నోటీసులపై విజయ్ హైకోర్టును ఆశ్రయించారు. సీఐడీ విచారణకు సహకరించాలని హైకోర్టు సూచించిన నేపథ్యంలో రెండు పర్యాయాలుగా జరిగిన విచారణ కు విజయ్ హజరైయ్యారు.
Breaking: బీజేపీకి కన్నా రాజీనామా .. ఏపి పార్టీ నాయకత్వంపై కీలక వ్యాఖ్యలు..ట్విస్ట్ ఏమిటంటే..?