టీడీపీ నేత, మాజీ మంత్రి నారాయణకు చెందిన విద్యా సంస్థ ప్రధాన కార్యాలయంలో ఏపి సీఐడీ అధికారులు సోదాలు నిర్వహించడం కలకలాన్ని రేపాయి. హైదరాబాద్ మాదాపూర్ లోని ఎన్ ఎస్ పీ ఐ ఆర్ ఏ సంస్థలో సీఐడీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఈ విద్యాసంస్థ నుండి రామకృష్ణ హౌసింగ్ సంస్థలోకి నిధులు మళ్లించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ మళ్లించిన నిధులతో నారాయణ బినామీ పేర్లతో భూములు కొనుగోలు చేసినట్లుగా ఏపీ సీఐడీ భావిస్తున్నది. అదే విధంగా ఏపి రాజధాని అమరావతిలో చట్టవిరుద్దంగా అసైన్డ్ భూముల కొనుగోలు చేసినట్లు ఆరోపిస్తున్నారు.

టీడీపీ ఎంపీ కేశినేని నానితో భేటీపై స్పందించిన మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు.. ఇదీ వివరణ
2020 లో నమోదైన రాజధాని అమరావతి అసైన్డ్ భూముల కేసులో సీఐడీ అధికారులు సోదాలు జరుపుతున్నట్లు సమాచారం. 2020లో ఎఫ్ఐఆర్ 14,15/2020 పేరుతో కేసులు నమోదు కాగా ఈ కేసుల్లో మాజీ మంత్రి నారాయణ ముందస్తు బెయిల్ తీసుకున్నారు. నారాయణ సంస్థల్లో జరుగుతున్న తనిఖీల్లో 22 మంది సీఐడీ అధికారులు పాల్గొన్నారు. కాగా మాజీ మంత్రి నారాయణ పై ఈ కేసుతో పాటు ఓటర్ రింగ్ రోడ్డ్ అలైన్ మెంట్ మార్పు కేసు, పదవ తరగతి ప్రశ్నాపత్రాల లీక్ కేసు కూడా ఉన్న సంగతి తెలిసిందే.
మరో సారి కీలక వ్యాఖ్యలు చేసిన ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి