NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

సీఐడీ ప్రత్యేక కోర్టు లో టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తకు బిగ్ రిలీఫ్

టీడీపీ సోషల్ మీడియా కార్యకర్త వెంగళరావుకు ఏపి సీఐడీ ప్రత్యేక కోర్టు బిగ్ రిలీఫ్ ఇచ్చింది. సీఐడీ అధికారుల రిమాండ్ రిపోర్టును తిరస్కరించి వ్యక్తిగత పూచికత్తుతో వెంటనే రిలీజ్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది సీఐడీ ప్రత్యేక కోర్టు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తన యూట్యూబ్ ఛానల్ లో వీడియోలు పెట్టారన్న ఆరోపణపై సీఐడీ అధికారులు గురువారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం ఉదయం నుండి సాయంత్రం వరకూ సీఐడీ కార్యాలయంలో ఆయన్ను విచారించారు. తర్వాత ప్రాధమిక వైద్య పరీక్షలు జరిపించి రాత్రి అతన్ని గుంటూరు ఆరవ అదనపు మెజిస్టేట్ శృతి ఎదుట ఆమె నివాసంలో హజరుపర్చారు. ఈ సందర్భంలో మెజిస్టేట్ వద్ద తనను సీఐడీ పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించి హింసించారని, బెదిరింపులకు గురి చేశారని వెంగళరావు ఆరోపించారు.

 

వెంగళరావు వ్యాంగ్మూలాన్ని నమోదు చేసుకున్న మెజిస్ట్రేట్ .. నిందితుడికి గుంటూరు జీజీహెచ్ లో వైద్య పరీక్షలు జరిపించి మరల హజరుపర్చాలని ఆదేశించారు. కోర్టు ఆదేశాలతో గుంటూరు జీజీహెచ్ లో వెంగళరావుకు వైద్య పరీక్షలు నిర్వహించిన సీఐడీ అధికారులు .. మధ్యాహ్నం తిరిగి సీఐడీ ప్రత్యేక కోర్టు లో హజరుపర్చారు. ఈ సందర్భంగా వెంగళరావు రిమాండ్ కు సంబంధించి సీఐడీ అధికారులు సమర్పించిన రిమాండ్ రిపోర్టును మెజిస్ట్రేట్ తిరస్కరించారు. 41 సీఆర్పీసీ కింద నిందితుడికి నోటీసు ఇవ్వలేదనీ, నిబంధనలకు విరుద్దంగా జరిగే అరెస్టుల్లో రిమాండ్ రిపోర్టును అంగీకరించేది లేదని స్పష్టం చేస్తూనే నిందితుడు వెంగళరావుకు వ్యక్తిగత పూచీకత్తు తోనే బెయిల్ మంజూరు చేశారు. వెంగళరావు విడుదల అయిన తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు ఆయనతో నేరుగా ఫోన్ చేసి పరామర్శించారు.

రీసెంట్ గా హైదరాబాద్ లోనూ గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కు 41 సీఆర్పీసీ నోటీసు ఇవ్వకుండానే పోలీసులు అరెస్టు చేసి న్యాయస్థానంలో హజురపరిస్తే మెజిస్ట్రేట్ ..ఎటువంటి షరతులు లేకుండా బెయిల్ మంజూరు చేస్తూ ఇంటి వద్ద దింపాలంటూ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.

author avatar
sharma somaraju Content Editor

Related posts

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju