NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ సినిమా

AP Cinema Tickets: ఏపిలో ఆన్‌లైన్‌ లో సినిమా టికెట్ల విక్రయాలు .. మార్గదర్శకాలు జారీ చేసిన సర్కార్

AP Cinema Tickets: ఏపిలో ఆన్‌లైన్‌లో సినిమా టికెట్ల విక్రయాలపై ఏపి సర్కార్ శుక్రవారం మార్గదర్శకాలను జారీ చేసింది. సినిమా టికెట్ల అమ్మకాలకు సంబంధించి నోడల్ ఏజన్సీగా ఆంధ్రప్రదేశ్ ఫిలిం డవలప్‌మెంట్ కార్పోరేషన్ (ఏపిఎఫ్‌డీసీ) సర్వీస్ ప్రొవైడర్ బాధ్యతల నిర్వహణ అప్పగించింది. ఇకపై రాష్ట్రంలోని థియేటర్లు ఏపిఎఫ్‌డీసీ తో అగ్రిమెంట్ చేసుకోవాలి. ప్రతి టికెట్ ధరపై 2 శాతంకు మించి సర్వీస్ చార్జి వసూలు చేయకూడదు. ఇప్పటికే ఆన్ లైన్ లో టికెట్లు అమ్ముతున్న సంస్థలు, సినిమా థియేటర్లు ఆ కార్యకలాపాలు కొనసాగించుకోవచ్చు. అయితే నోడల్ ఏజన్సీ నియమించిన సర్వీస్ ప్రొవైడర్ గేట్‌వే ద్వారానే విక్రయాలు చేపట్టాలని ప్రభుత్వం పేర్కొంది.

AP Cinema Tickets online booking Guidelines
AP Cinema Tickets online booking Guidelines

AP Cinema Tickets: మౌళిక సదుపాయాలను థియేటర్ల యాజమాన్యాలే కల్పించాలి

సర్వీస్ ప్రొవైడర్ ప్లాట్ ఫామ్ తో అనుసంధానమయ్యేందుకు కావాల్సిన మౌళిక సదుపాయాలను థియేటర్ల యాజమాన్యాలే కల్పించాల్సి ఉంటుంది. ఈ విధానం అమల్లోకి వచ్చిన 30 రోజుల్లోగా అన్ని థియేటర్ లలో నిబంధనలన్నీ కఛ్చితంగా అమలు కావాలని పేర్కొంది. లేకుంటే వారి లైసెన్సు రద్దు చేయడం జరుగుతుందని హెచ్చరించింది. సినిమా తొలి ప్రదర్శనకు ఏడు రోజుల ముందు నుండి మాత్రమే ఆన్ లైన్ ద్వారా టికెట్ల అమ్మకాలు ప్రారంభించాలని మార్గదర్శకాల్లో పేర్కొంది. ప్రతి టికెట్ పైనా.. జీఎస్టీ, సర్వీస్ టాక్స్ ఎంత వసూలు చేస్తున్నారనేది స్పష్టంగా ముద్రించాలని ప్రభుత్వం పేర్కొంది.

 

కాగా, సినిమా టెకెట్ల ధరలను నియంత్రించేందుకు, బ్లాక్ మార్కెటింగ్ నిరోధించేందుకు ప్రభుత్వమే ఆన్ లైన్ ద్వారా టికెట్లు అమ్మకాలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిన సమయంలో రాష్ట్రంలో పెద్ద దుమారమే రేగిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో ప్రభుత్వంపై ప్రతిపక్షాలు, సినీ పరిశ్రమలోని కొందరు ఆరోపణలు, విమర్శలు చేశారు. కొందరు కోర్టును ఆశ్రయించారు. అయితే ఈ విషయంలో ఏపి ప్రభుత్వానికి హైకోర్టులో ఊరట లభించింది. సినిమా టికెట్లను ఆన్ లైన్ లో అమ్మకాలకు కోర్టు అనుమతించింది. ఏపి స్టేట్ ఫిల్మ్, టెలివిజన్, థియేటర్ డవలప్‌మెంట్ కార్పోరేషన్ (ఏపిఎస్ఎఫ్‌టీవిడీసి) ద్వారా ప్రభుత్వం ఆన్ లైన్ లో సినిమా టికెట్లు అమ్ముకోవచ్చని తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తాజాగా గైడ్ లైన్స్ విడుదల చేసింది.

author avatar
sharma somaraju Content Editor

Related posts

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Malli Nindu Jabili March 29 2024 Episode 610: 19వ తారీకు మాలిని కి పెళ్లి చేస్తే ధైర్యం ఉంటే ఆపవే అంటున్న వసుంధర..

siddhu

Kumkuma Puvvu March 29 2024 Episode 2142: అంజలి శాంభవి గారిని ఎలా డి కొడుతుంది.

siddhu

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Guppedanta Manasu March 29 2024 Episode 1037: మనుని తిరిగి కాలేజ్ కి రమ్మని అనుపమ చెబుతుందా లేదా.

siddhu

Madhuranagarilo March 29 2024 Episode 325: శ్యామ్ ని సొంతం చేసుకోమని దాక్షాయిని చలపతి చెప్పిన మాటలు విన్న రుక్మిణి ఏం చేయనున్నది..

siddhu

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Paluke Bangaramayenaa March 29 2024 Episode 189: స్వర అభిలకు పెళ్లి జరిగిందని తెలుసుకున్న విశాల్ ఏం చేయనున్నాడు..

siddhu