NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP CM Jagan: నేడు, రేపు జనం మధ్యలో జగన్.. ! పర్యటన సాగేదిలా..!!

AP CM Jagan: ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి నేడు, రేపు వరద ప్రభావిత జిల్లాలో పర్యటించి బాధితులను పరామర్శించనున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో అపార నష్టం వాటిల్లిన సంగతి తెలిసిందే. ప్రాణనష్టంతో పాటు భారీగా ఆస్తినష్టం సంభవించింది. వరద ప్రభావంతో మూడు జిల్లాలు అతలాకుతలం అయ్యాయి. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాల్లో సహాయక చర్యలు ఆరా తీయడంతో పాటు బాధితులను పరామర్శించనున్నారు. భారీ వర్షాలతో దెబ్బతిన్న ప్రాజెక్టులను సీఎం జగన్ స్వయంగా పరశీలించనున్నారు.

AP CM Jagan Kadapa, Chittoor tour
AP CM Jagan Kadapa Chittoor tour

AP CM Jagan: గురువారం (నేడు) పర్యటన ఇలా..

ఉదయం 9.30 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్టు నుండి కడప జిల్లా బయలుదేరి వెళతారు. 10.30 గంటలకు కడప జిల్లా మందపల్లి చేరుకుంటారు. అక్కడ నుండి సీఎం జగన్ పుల్లపొత్తూరు గ్రామానికి చేరుకుంటారు. గ్రామంలో పర్యటించి వరదకు దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించి సహాయ శిబిరంలో బాధితులతో మాట్లాడతారు. మధ్యాహ్నం 12 గంటలకు పుల్లపొత్తూరు గ్రామ సచివాలయానికి చేరుకుంటారు. అక్కడ నుండి ఎగుమండపల్లి గ్రామంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో కాలినడకన పర్యటించి బాధితులను పరామర్శించనున్నారు. అనంతరం వరదలకు దెబ్బతిన్న అన్నమయ్య డ్యామ్ ను పరిశీలించనున్నారు. ఈ సందర్భంలో వరద ప్రభావం ఫలితంగా ప్రాజెక్టుకు జరిగిన నష్టంపై సీఎం జగన్ కు అధికారులు వివరాలు అందజేయనున్నారు. మధ్యాహ్నం 2.15 గంటలకు మండపల్లి చేరుకుని వరద నష్టం, అనంతర సహాయ చర్యలపై జిల్లా ప్రజా ప్రతినిధులు, అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. అనంతరం మధ్యాహ్నం 3.05 గంటలకు చిత్తూరు జిల్లా రేణిగుంట ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడ రేణిగుంట మండలం వేదలచెరువు, ఎస్టీ (యానాది) కాలనీకి చేరుకుని కాలనీ వాసులతో ముఖాముఖి, సమీక్ష నిర్వహించనున్నారు. 4.40 గంటలకు ఏర్పేడు మండలం పాపనాయుడు పేట గ్రామానికి చేరుకుని వరద నష్టాన్ని పరిశీలిస్తారు. అక్కడ నుండి తిరుపతి రూరల్ మండలం తిరుచానూరు, పాడిపేట క్రాస్ రోడ్డు వద్ద వరద నష్టంపై బాధితులతో మాట్లాడనున్నారు. తదుపరి పద్మావతి అతిధి గృహానికి చేరుకుంటారు. అక్కడ సాయంత్రం 5 గంటలకు వరద నష్టం, సహాయ పునరావాసంపై అధికారులు, ప్రజా ప్రతినిధులతో సమీక్ష నిర్వహించనున్నారు. రాత్రి పద్మావతి అతిధి గృహంలో సీఎం జగన్ బసచేయనున్నారు.

శుక్రవారం పర్యటన  ఇలా..

తిరుపతి కృష్ణానగర్, ఆటోనగర్ లో పర్యటించి బాధితులను పరామర్శించనున్నారు. ఉదయం 11 గంటలకు నెల్లూరు జిల్లాకు బయలుదేరి వెళ్లనున్నారు. నెల్లూరు రూరల్, కోవూరు నియోజకవర్గంలో పర్యటించి వరద సహాయ చర్యలను సమీక్షించి బాధితులను పరామర్శించనున్నారు. తరువాత పెన్నా నదీ వరద ప్రభావంతో దెబ్బతిన్న ప్రాంతాలను, వ్యవసాయ పంటలను సీఎం జగన్ పరిశీలించనున్నారు. 1.15 గంటలకు నెల్లూరు నగర పాలక సంస్థ పరిధిలో బాధిత కుటుంబాల పరామర్శ. అనంతరం అధికారులతో సమీక్ష చేయనున్నారు. తరువాత 3.20 గంటలకు రేణిగుంట ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. 4.20 గంటలకు రేణిగుంట నుండి గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకుని అక్కడ నుండి రోడ్డు మార్గంలో తాడేపల్లికు చేరుకోనున్నారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju