NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ట్రెండింగ్ న్యూస్

CM Jagan: ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం జగన్.. పీఆర్సీపై కీలక ప్రకటన..

CM Jagan: ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఏపి జేఏసీ, ఏపి జేఏసీ అమరావతి సంఘాలు ఉద్యమ కార్యాచరణ ప్రకటించిన రెండు రోజుల వ్యవధిలోనే ప్రభుత్వం దిగివచ్చినట్లు కనబడుతోంది. ఉద్యోగుల పీఆర్సీపై సీఎం వైఎస్ జగన్ కీలక ప్రకటన చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల పర్యటనలో ఉన్న సీఎం వైఎస్ జగన్ ను తిరుపతి సరస్వతీ నగర్ లో ఉద్యోగుల తరపున కొందరు ప్రతినిధులు కలిసి పీఆర్‌సీపై విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంలో వారికి సీఎం జగన్ తీపి కబురు చెప్పారు. పీఆర్సీ ప్రక్రియ పూర్తయిందనీ, పది రోజుల్లో ప్రకటన చేస్తామని తెలిపారు. సీఎం జగన్ నేరుగా పది రోజుల్లో ప్రకటన చేస్తామని హామీ ఇవ్వడంతో ఉద్యోగ సంఘాల నేతలకు ఒక భరోసా లభించింది.

AP CM Jagan key statement on employees prc
AP CM Jagan key statement on employees prc

మరో పక్క ప్రభుత్వం..ఉద్యోగ సంఘాలను చర్చలకు ఆహ్వానించింది. తమ డిమాండ్ ల సాధన కోసం ఉద్యమ కార్యాచరణ ప్రకటించిన నేతలతో మాట్లాడాలని నిర్ణయించింది. ఈ రోజు మధ్యాహ్నం జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి హజరుకావాలని అన్ని ఉద్యోగ సంఘాలకు జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ కుమార్ సమాచారం పంపారు. ఉద్యోగ సంఘాల నేతలు బుధవారం నాడే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సమీర్ శర్మను కలిసి పోరుబాటపై నోటీసు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఉద్యమ కార్యాచరణ ప్రకటించిన రెండు రోజుల వ్యవధిలోనే జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయడంతో సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుందని ఉద్యోగ సంఘాల నేతలు భావిస్తున్నారు. దీనికి తోడు వైఎస్ జగన్ స్వయంగా పీఆర్సీ గురించి ప్రకటన చేయడంతో వీరిలో ఆశలు చిగురిస్తున్నాయి. పీఆర్సీ, సీపీఎస్ రద్దు, పెండింగ్ డీఏ లతో సహా సుమారు 45 డిమాండ్లను ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వం దృష్టిలో పెట్టారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju