NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP CM Jagan: ప్రధాని మోడీకి ఏపీ సీఎం వైఎస్ జగన్ లేఖ..! ఈ విషయంపైనే…!!

AP CM Jagan: ఏపిలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా తీవ్ర నష్టం జరిగిన సంగతి తెలిసిందే. ఆస్తి, ప్రాణనష్టం సంభవించింది.  వేలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. దాదాపు అయిదు జిల్లాల్లో తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ, హోంశాఖ మంత్రి అమిత్ షా లకు ఏపి సీఎం వైఎస్ జగన్ వేరువేరుగా లేఖలు రాశారు భారీవర్షాలకు రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందనీ, తక్షణమే ఆదుకోవాలని కేంద్రాన్ని కోరారు. రాష్ట్రానికి తక్షణం వెయ్యి కోట్ల రూపాయలు సాయం ప్రకటించాలని సీఎం జగన్ విజ్ఞఫ్తి చేశారు. వరద నష్టం అంచనాకు కేంద్ర బృందాన్ని పంపాలని కోరారు.

AP CM Jagan letter pm modi, amith shah
AP CM Jagan letter pm modi amith shah

Read More: AP Capital Issue: జగన్ వెనుకడుగు వెనుక ఈ భారీ వ్యూహం..??

AP CM Jagan: నాలుగు జిల్లాల్లో అసాధారణ వర్షపాతం

రాష్ట్రంలోని కడప, చిత్తూరు, అనంతపురం, నెల్లూరు జిల్లాల్లో అసాధారణ వర్షపాతం నమోదు అయ్యింది. చాలా చోట్ల 20 సెంమీ కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది, గ్రామీణ ప్రాంతాల్లోనూ తీవ్రనష్టం వాటిల్లింది అని సీఎం వైఎస్ జగన్ లేఖలో పేర్కొన్నారు. 196 మండలాలు నీట మునిగాయానీ, 324 పునరావస కేంద్రాలు ఏర్పాటు చేసి 69,616 మందికి పునరావాసం కల్పించామని చెప్పారు. కడప, చిత్తూరు, నెల్లూరు, అనంతపురం జిల్లాల్లో రహదారులు, చెరువులు, కాల్వలు కోతకు గురయ్యాయనీ, చెరువులకు గండ్లు పడటం వల్ల చాలా ప్రాంతాలు నీట మునిగాయానీ సీఎం జగన్ లేఖలో పేర్కొన్నారు.

భారీ వర్షాలకు దాదాపు 6.54 వేల కోట్ల నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. దాదాపు 40 మంది వరదల కారణంగా చనిపోయారన్నారు. వరద ప్రవాహం వల్ల పలు చోట్ల రైల్వే ట్రాక్ లు కొట్టుకుపోయాయన్నారు. టెంపుల్ టౌన్ తిరుపతి అతలాకుతలమైందని గుర్తు చేస్తూ.. రెండు హెలికాఫ్టర్ లు, 17 ఎన్డీఆర్ఎఫ్, ఎస్టీఆర్ఎఫ్ బృందాలతో సహాయక చర్యలు చేపట్టామని వివరించారు. నాలుగు రోజుల క్రితమే ప్రధాన మంత్రి మోడీ ఏపి  సీఎం జగన్ కు ఫోన్ చేసి వరద పరిస్థితిపై ఆరా తీశారు. ఆ సమయంలోనే కేంద్రం నుండి అవసరమైన సాయం అందిస్తామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju