YS Jagan: ఏపీ సీఎం వైఎస్ జగన్ తన తండ్రి వైఎస్ఆర్ కి ఘన నివాళులర్పించారు. దివంగత సీఎం వైఎస్ఆర్ 13వ వర్థంతి సందర్భంగా వైఎస్ జగన్ ఇడుపులపాయకు వెళ్లి వైఎస్ఆర్ ఘాట్ లోని సమాధి వద్ద నివాళులర్పించారు. అనంతరం పార్ధనల్లో పాల్గొన్నారు. ఆ సమయంలో సీఎం జగన్ తల్లి విజయమ్మ కూడా అక్కడే ఉన్నారు. అయితే జగన్ ఇడుపులపాయకు రాకముందే ఆయన సోదరి వైఎస్ షర్మిల అక్కడకు చేరుకుని తండ్రి సమాధి వద్ద తల్లి విజయమ్మతో కలిసి నివాళులర్పించి వెళ్లిపోయారు.
జగన్ తో పాటు ఇడుపులపాయలో డిప్యూటి సీఎం అంజాద్ బాషా, మంత్రి ఆదిమూలపు సురేష్, ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యేలు గడికోట శ్రీకాంత్ రెడ్డి, రవీంద్రనాథ్ రెడ్డి, మేడా మల్లికార్జున రెడ్డి, రఘురామిరెడ్డి, పీజేఆర్ సుధాకర్ బాబు, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి, ఆర్టీసీ చైర్మన్ మల్లికార్జునరెడ్డి, మేయర్ సురేష్ బాబులు పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం జగన్ దంపతులు ప్రత్యేక విమానంలో కడప నుండి విజయవాడ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. ఇవేళ రాత్రికి జగన్, భారతి దంపతులు లండన్ బయలుదేరి వెళ్లనున్నారు. లండన్ లో చదువుతున్న తమ పిల్లలతో పది రోజుల పాటు గడపనున్నారు సీఎం జగన్ దంపతులు. ఈ నెల 12వ తేదీన తిరిగి వస్తారు.
Janasena: జనసేన పార్టీ కి తాళం పడే బిగ్ బ్రేకింగ్ న్యూస్ !