YS Jagan: ముఖ్యమంత్రి వైఎస్ జన్మోహనరెడ్డి రేపటి వైఎస్ఆర్ జిల్లా పర్యటన రద్దు అయ్యింది. రేపు వైఎస్ఆర్ జిల్లా ఒంటిమట్టలో జరిగే శ్రీసీతారాముల కల్యాణ మహోత్సవానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించేందుకు ముందుగా షెడ్యుల్ ఖరారు అయ్యింది. అయితే సీఎం జగన్ నేడు స్వల్పంగా గాయపడ్డారు. ఉదయం వ్యాయామ సమయంలో కాలు బెణికింది. సాయంత్రానికి నొప్పి ఎక్కువ కావడంతో పరీక్షించిన వైద్యులు చికిత్స అందించారు.

విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు చేసిన సూచనల మేరకు రేపటి ఒంటిమిట్ట పర్యటనను రద్దు చేసుకున్నారు. ఈ విషయాన్ని సీఎంఒ ట్విట్టర్ వేదికగా తెలిపింది. సీఎం జగన్ గతంలోనూ ఇలానే కాలికి గాయం కావడంతో చాలా రోజులు ఇబ్బంది పడ్డారు. విషయం తెలుసుకున్న వైసీపీ శ్రేణులు, నేతలు జగన్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
Pawan Kalyan: జనసేన పట్ల బీజేపీ వైఖరి ఏమిటి ..? నేడు క్లారిటీ వచ్చేస్తుందా..! ఢిల్లీలో పవన్ బిజీబిజీ
ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్కు కాలినొప్పి*. ఉదయం ఎక్సర్సైజ్ చేస్తున్న సమయంలో బెణికిన కాలు. సాయంత్రానికి పెరిగిన నొప్పి. గతంలో ఇలానే కాలికిగాయం. చాలారోజులపాటు ఇబ్బందిపడ్డ ముఖ్యమంత్రి. ప్రయాణాలు రద్దుచేసుకోవాలని డాక్టర్ల సూచన. రేపటి ఒంటిమిట్ట పర్యటనను రద్దుచేసిన అధికారులు.
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) April 4, 2023