AP CM YS jagan: ప్రతిభ కనబర్చిన హాకీ ప్లేయర్ రజనీకి భారీగా బహుమతి ప్రకటించిన సీఎం వైఎస్ జగన్..

Share

AP CM YS jagan: టోక్యో ఒలింపిక్స్ లో ప్రతిభ కనబర్చిన హాకీ క్రీడాకారిణి ఇ రజనికి ఏపి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి భారీ గా నజరానా అందించారు. బుధవారం సీఎం జగన్ ను తాడేపల్లిలో క్యాంప్ కార్యాలయంలో రజనీ మర్యాదపూర్వకంగా కలిశారు.  సందర్భంగా రజనీకి సీఎం వైఎస్ జగన్ పుష్పగుచ్చం అందించి శాలువా కప్పి సత్కరించారు. జ్ఞాపికను అందజేసి అభినందించారు. రజనీకి రూ.25లక్షల నగదు ప్రోత్సహాకంతో పాటు వెయ్యి గజాల నివాస స్థలం, ఆమె కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు.

AP CM YS jagan announces Hug incentives to hockey player rajani
AP CM YS jagan announces Hug incentives to hockey player rajani

Read More: Modi Govt: తూచ్..ఆ కమిటీనే లేదు..!!

అదే విధంగా రజనీకి గతంలో ప్రకటించి, పెండింగ్ లో ఉన్న బకాయిలను కూడా వెంటనే విడుదల చేయాలని అదేశించారు. తిరుపతిలో వెయ్యి గజల నివాస స్థలం, నెలకు రూ.40వేల చొప్పున ఇన్సెంటివ్ ఇవ్వాలని ఆదేశించారు.  రజనీ స్వగ్రామం చిత్తూరు జిల్లా ఎర్రావారిపాలెం. దక్షిణాది రాష్ట్రాల నుండి ఒలంపిక్స్ హాకీలో పాల్గొన్న ఏకైక క్రీడాకారిణిగా రజని ప్రత్యేక గుర్తింపు పొందారు. 2016 లో జరిగిన రోయ ఒలంపిక్స్ తో పాటు టోక్యో ఒలంపిక్స్ 2020 లో పాల్గొన్న క్రీడాకారిణిగా గుర్తింపు పొందారు. భారత్ తరపున రజనీ 110 అంతర్జాతీయ హామీ మ్యాచ్ లలో పాల్గొన్నారు. గోల్ కీపర్ గా మంచి మంచి ప్రతిభ కనపరిచారు రజని, టోక్య ఒలపింక్స్ లో కాంస్య పతక పోరులో మహిళల హాకీ టీమ్ ఓటమి పాలైనప్పటికీ భారత అభిమానుల మనసులను గెలుచుకున్నారు.

ఈ కార్యక్రమంలో రజనీ కుటుంబ సభ్యులు, పర్యాటక, సాంస్కృతిక, యువజన సర్వీసులు, క్రీడా శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్ధ రెడ్డి, రెవెన్యూ ప్రిన్సిపాల్ సెక్రటరీ రజిత్ భార్గవ, శాప్ వీసీ అండ్ ఎండీ ఎన్ ప్రభాకరరెడ్డి, శాప్ అధికారులు పాల్గొన్నారు.


Share

Related posts

Pawan Kalyan: ఏపీలో రహదారుల విషయంలో మరోసారి సీరియస్ వ్యాఖ్యలు చేసిన పవన్ కళ్యాణ్..!!

sekhar

Tirupathi Bypoll : తిరుపతి ఉప ఎన్నికలలో గెలుపునకు వైసీపీ వ్యూహాత్మక అడుగులు…ఆ ఇద్దరు కీలక నేతలకు పూర్తి బాధ్యతలు అప్పగింత

somaraju sharma

‘ఆర్‌టిసి సమ్మె కొనసాగుతోంది’

somaraju sharma