NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

అవార్డులు సాధించిన ప్రజ-ా ప్రతినిధులు, అధికారులను అభినందించిన సీఎం జగన్

కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన స్వచ్చ సర్వేక్షణ్ అవార్డుల్లో ఏపికి ఏకంగా 11 అవార్డులు లభించాయి. రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, నగర పాలక సంస్థలకు ఈ అవార్డులు రాగా, ఢిల్లీలో జరిగిన అవార్డుల ప్రధానోత్సవంలో ఆయా పురపాలికల అధికారులు, ప్రజా ప్రతినిధులు అవార్డులు అందుకున్నారు. శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ .. పురపాలిక, పట్టణాభివృద్ధి శాఖలపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంలో కేంద్ర ప్రభుత్వం నుండి అవార్డులు అందుకున్న పురపాలికలకు చెదంిన ప్రజా ప్రతినిధులు, అధికారులు అవార్డులు పట్టుకుని సీఎం జగన్ ను కలిశారు.

AP CM YS Jagan

అధికారుల చేతుల్లోని అవార్డులను చూసి సీఎం జగన్ సంతోషం వ్యక్తం చేస్తూ వారిని అభినందించారు. ఒకే ఏడాదజి రాష్ట్రానికి స్వచ్చ సర్వేక్షణ్ లో 11 అవార్డులు రావడం హర్షనీయమన్నారు. ఇదే స్పూర్తిని కొనసాగిస్తూ భవిష్యత్తులో రాష్ట్రానికి మరిన్ని అవార్డులు తీసుకుని రావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, మరో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పురపాలక పట్టణాభివృద్ధి శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ శ్రీలక్ష్మి, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, అవార్డులు పొందిన కార్పోరేేషన్ల మేయర్లు, మున్సిపల్ చైర్మన్ లు, కమిషన్ లు పాల్గొన్నారు.

AP CM YS Jagan

 

కాగా సమీక్షా సమావేశం సందర్భంగా సీఎం జగన్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో వర్షాలు బాగా కురుస్తున్నాయనీ, పట్టణాల్లో, నగరాల్లో రోడ్ల పరిస్థితిని పరిశీలించాలని ఆదేశించారు. మార్చి 31 నాటికి అన్ని రోడ్లనూ బాగు చేయాలని చెప్పారు. ప్లాస్టిక్ ఫ్లెక్సీలను రాష్ట్ర ప్రభుత్వం బ్యాన్ చేసినందున దీన్ని సంపూర్ణంగా అమలు చేయడానికి సంబంధిత వ్యాపారులతో కలెక్టర్ లు సమావేశాలు నిర్వహించాలని తెలిపారు. ప్లాస్టిక్ నుండి క్లాత్ వైపు మళ్లడానికి కావాల్సిన ఆర్ధిక వనరులను సమకూర్చుకునేందుకు అవసరమైన విధంగా వారికి తోడ్పాటుగా నిలవాలని, రుణాలు ఇప్పించి వారికి అండగా నిలవాలని చెప్పారు. జగనన్న స్మార్ట్ టౌన్ షిప్ కార్యక్రమంపై శద్ద పెట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రతి నియోజకవర్గంలో ఒక లే అవుట్ ను తీర్దిదిద్దాలనీ, జిల్లాల వారీగా కలెక్టర్ లతో దీనిపై సమీక్ష చేసి ప్రత్యేక దృషి పెట్టాలని సీఎం జగన్ ఆదేశించారు.

విశాఖలో పరిపాలనా రాజధాని మద్దతుగా.. సీఎం జగన్ వద్ద కీలక ప్రతిపాదన పెట్టిన మంత్రి ధర్మాన

AP CM YS Jagan

author avatar
sharma somaraju Content Editor

Related posts

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju