AP CM YS Jagan: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డికి ఇతర నేతలను పోల్చుకుంటే రాజకీయాల్లో సీనియారిటీ తక్కువే. కానీ అధికారం చేపట్టిన నాటి నుండి చేపడుతున్న పలు కార్యక్రమాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శం అవుతున్నాయి. తాజాగా జరిగిన మంత్రివర్గ విస్తరణ ప్రక్రియపైనా రాష్ట్ర రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతోంది. మూకుమ్మడిగా మంత్రులు అందరితో రాజీనామాలు చేయించి మళ్లీ మంత్రివర్గాన్ని కొలువుతీర్చడం అంటే డేరింగ్ స్టెప్ అని పలువురు పేర్కొంటున్నారు. జగన్మోహనరెడ్డి మొదటి నుండి తాను ఏది అనుకుంటే అది చెయ్యాల్సిందేననీ, ఎవరి మాట వినరు అన్న పేరు ఉంది. మంత్రివర్గ విస్తరణ చేపట్టడం పార్టీ నేతలకు పెద్ద సవాల్ లాంటిదే.అసంతృప్తులు వస్తాయి. వాటిని పరిష్కరించుకోవాలి. అందుకే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనూ, ఆ తర్వాత విభజిత ఆంధ్రప్రదేశ్ లోనూ ఈ స్థాయి లో మంత్రివర్గ విస్తరణ ఎప్పుడూ జరగలేదు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న మూడు సార్లలలో ఎప్పుడూ ఈ మాదిరిగా మంత్రివర్గ ప్రక్షాళన కార్యక్రమం చేపట్టలేదు.

AP CM YS Jagan: చంద్రబాబు హయాంలో
గతంలో చంద్రబాబు మంత్రివర్గ విస్తరణ చేపట్టారు కానీ పూర్తి స్థాయిలో పునర్వ్యవస్థీకరణ చేయలేదు. మంత్రులందరితీ మూకుమ్మడిగా రాజీనామాలు చేయించిన దాఖలాలు లేవు. జగన్మోహనరెడ్డి తీసుకున్నట్లుగా డేరింగ్ స్టెప్ లు చంద్రబాబు తీసుకునే వారు కాదు. పార్టీలో సీనియర్ ల నుండి వ్యతిరేకత వస్తుందేమో అని భయపడేవారు. చంద్రబాబు మంత్రి వర్గంలో సీనియర్ మంత్రులను పలువురుని కొనసాగిస్తుండేవారు. యనమల రామకృష్ణుడు, కోడెల శివప్రసాద్, అయ్యన్న పాత్రుడు, అచ్చెన్నాయుడు లాంటి వారిని తన మంత్రివర్గంలో కొనసాగిస్తుండే వారు. చంద్రబాబు నాయుడు ఇతర పార్టీల నుండి వచ్చిన ఎమ్మెల్యేలకు మంత్రివర్గంలోకి తీసుకున్నారు. వైసీపీ నుండి టీడీపీ లో చేరిన నలుగురుకి చంద్రబాబు మంత్రి వర్గంలోకి తీసుకోవడంపై అప్పట్లో పెద్ద చర్చే జరిగింది. విమర్శలు వచ్చాయి.
జగన్ తొలి దశ మంత్రివర్గంలోనూ
అయితే జగన్మోహనరెడ్డి విషయానికి వస్తే సీనియారిటీ కంటే పార్టీ పట్ల విధేయత, సామాజిక సమీకరణాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లు కనబడుతోంది. ప్రధానంగా బీసీ వర్గాలు మళ్లీ తెలుగుదేశం పార్టికి దగ్గర అవ్వకుండా ఆ వర్గాలకు ఎక్కువ మంత్రి పదవులు కేటాయించారు. తొలి దశ మంత్రివర్గంలోనూ ఇదే సూత్రాన్ని పాటించారు. తొలి విడత గానీ, ఇప్పుడు గానీ ఊహించిన వాళ్లకు మంత్రి వర్గంలో స్థానం లభించలేదు. ఊహించని వాళ్లకు కొత్త వాళ్లకు మంత్రి పదవులు దక్కాయి. సీనియర్ లను పక్కన పెట్టి జూనియర్ లకు ప్రాధాన్యత ఇచ్చారు జగన్. ఈ మాదిరి ధైర్యంతో మంత్రి వర్గ ప్రక్షాళన చేయడంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. దటీజ్ జగన్ అనాల్సింందేనని అంటున్నారు.