NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

CM YS Jagan: ఏపీ సీఎం వైఎస్ జగన్ రెండు రోజుల ఢిల్లీ పర్యటన .. ఎందుకంటే..?

Share

CM YS Jagan: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన రెడ్డి ఢిల్లీ పర్యటన ఖరారు అయ్యింది. ఆయన రేపు, ఎల్లుండి ఢిల్లీలో పర్యటించనున్నారు. రేపు (సోమవారం) సాయంత్రం 4 గంటలకు సీఎం జగన్ తాడేపల్లి నివాసం నుండి బయలుదేరి సాయంత్రం 6.45 గంటలకు ఢిల్లీకి చేరుకోనున్నారు. రాత్రికి 1 – జన్ పథ్ నివాసంలో సీఎం జగన్ బస చేయనున్నారు. ఏపి గ్లోబల్ ఇన్వెస్టర్ల సమ్మిట్ రౌండ్ టేబుల్ సమావేశంలో భాగంగా మంగళవారం నిర్వహించే కర్టెన్ రైజర్ కార్యక్రమాలకు సీఎం జగన్ హజరుకానున్నారు. మంగళవారం ఉదయం 10.30 గంటల నుండి సాయంత్రం 5.30 గంటల వరకూ ఢిల్లీ లీలా ప్యాలెస్ హోటల్ నందు దౌత్య వేత్తలతో సీఎం జగన్ సమావేశమవుతారు. ఆ కార్యక్రమం అనంతరం రాత్రికి తాడేపల్లికి చేరుకుంటారు.

CM YS Jagan

 

కాగా సీఎం జగన్ రేపు మధ్యాహ్నం వరకూ పల్నాడు జిల్లాలో పర్యటించనున్నారు. రేపు ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుండి బయలుదేరి 10.40 గంటలకు పల్నాడు జిల్లా వినుకొండ చేరుకుంటారు. ఉదయం 11.05 గంటల నుండి మధ్యాహ్నం 12,20 గంటల వరకూ వినుకొండ వెల్లటూరు రోడ్డులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. ఈ సందర్భంగా జగనన్న చేదోడు వాదోడు పథకానికి బటన్ నొక్కి లబ్దిదారుల ఖాతాలకు నగదు బదిలీ చేస్తారు. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత మధ్యాహ్నం 1.05 గంటలకు తిరుగు ప్రయాణం అయి మధ్యాహ్నం 1.45 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు సీఎం జగన్.

ఎస్ఐ, కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలపై టీ సర్కార్ కీలక నిర్ణయం


Share

Related posts

బిగ్ బాస్ 4: ఈసారి సెలబ్రిటీల సపోర్ట్ ఎక్కువ అతనికే..!!

sekhar

Devatha Serial: దేవత సీరియల్ ఆదివారం స్పెషల్.. రాధ ఈ మార్పును భరిస్తుందా.!?

bharani jella

పూజా హెగ్డే వల్ల ‘రాధే శ్యామ్’ నుంచి రివీలైన టాప్ సీక్రెట్స్.. ప్రభాస్ ఫ్యాన్స్ కి ఇది తెలిస్తే ఇప్పుడే పండగ చేసుకుంటారు ..!

GRK