YS Jagan: ఏపీ సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి మరో సారి ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. ఢిల్లీకి చేరుకున్న సీఎం వైఎస్ జగన్ ను వైసీపీ ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డిలు స్వాగతం పలికారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షా, ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ లను కలవనున్నారు. ఏపికి రావాల్సిన నిధులు, బకాయిలపై చర్చించనున్నారని ప్రచారం జరుగుతున్నా అసలు మేటర్ వేరే ఉందని అంటున్నాయి విపక్షాలు. మధ్యాహ్నం 3 గంటలకు హోం మంత్రి అమిత్ షా, సాయంత్రం 4.30 గంటలకు ప్రధాని మోడీ, ఆరు గంటలకు ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ తో సీఎం భేటీ కానున్నారు. ఇవేళ రాత్రికి ఢిల్లీలోనే బస చేయనున్న సీఎం జగన్.. రేపు కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ సహరా అందుబాటులో ఉన్న కేంద్ర మంత్రులను కలవనున్నారు.

అయితే సీఎం జరగన్ తరచూ ఢిల్లీ పర్యటనలు చేస్తున్నారనే విమర్శలు ప్రతిపక్షాల నుండి ఎదురవుతున్నాయి. రాష్ట్ర సమస్యలపై చర్చించేందుకు అని చెబుతున్నా లోపల మాత్రం జరిగే చర్చలు వేరు అన్నది గట్టిగా వినబడుతున్నమాట. కేంద్ర పెద్దలతో భేటీ వెనుక రాజకీయ ఎజెండా కూడా ఉందని భావిస్తున్నారు. ఏపిలో ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉన్నా ఇప్పుడే రాజకీయ వాతావరణం వేడెకెక్కింది. ప్రధాన రాజకీయ పక్షాలు వ్యూహ ప్రతి వ్యూహాలతో రాజకీయం వేడెక్కుతోంది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ రాజకీయ వ్యూహాలకు పదును పెట్టారు. వైసీపీని అధికారం నుండి దించడమే తమ లక్ష్యంగా పేర్కొంటున్న ప్రతిపక్షాలు అందుకు అనుగుణంగా పావులు కదుపుతున్నాయి. ఈ క్రమంలో జగన్ ఢిల్లీ పర్యటనకు వెళ్లడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఇటీవల ఏపికి వచ్చిన అమిత్ షా, జేపీ నడ్డాలు జగన్మోహనరెడ్డి సర్కార్ పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు, విమర్శలు చేశారు. వీరు విమర్శలు చేసిన వెళ్లిన తర్వాత జగన్ ఢిల్లీలో అమిత్ షాతో భేటీ అవుతున్నారు. రాష్ట్రానికి సంబంధించిన పలు సమస్యలపై ఇంతకు ముందు పలు మార్లు ఢిల్లీకి వెళ్లి వినతి పత్రాలు ఇచ్చిన సీఎం జగన్ ఇప్పుడు మరల ఢిల్లీకి వెళ్లడంపే సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ పర్యటనలో రాష్ట్రానికి నిధులతో పాటు రాజకీయ కారణాలు కూడా ఉన్నాయనే చర్చ జోరుగా జరుగుతోంది. పోలవరం ప్రాజెక్టుకు రూ,12,911.15 కోట్లు విడుదల కేంద్రం అంగీకరించడంతో పాటు రెవెన్యూ లోటు కింద నిధుల విడుదల చేయడంపై కేంద్ర పెద్దలకు ఇవేళ సీఎం జగన్ ధన్యవాదాలు తెలియజేస్తూ రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించే అవకాశం ఉందని అంటున్నారు. ఏపిలో టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తుపై జోరుగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో అసలు బీజేపీ పెద్దల వైఖరి ఎలా ఉందనే విషయంపైనా జగన్ చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తొంది.
BJP: రఘునందనా.. ఏ కాలంలో ఉన్నావయ్యా..! మాట్లాడి, తూచ్ అంటే ఊరుకుంటారా..?