CM Jagan: ఏపి సీఎం వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఇవేళ అమరావతిలో పెద్ద ఎత్తున ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం చేపట్టిన సంగతి తెలిసిందే. ఆ కార్యక్రమంలో పాల్గొన్న పట్టాల పంపిణీ ప్రారంభించిన అనంతరం మూడు రోజుల పర్యనట నిమిత్తం సీఎం జగన్ ప్రత్యేక విమానంలో ఢిల్లీ చేరుకున్నారు. కొద్ది సేపటి క్రితం ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ తో భేటీ అయ్యారు. దాదాపు 40 నిమిషాల సేపు కేంద్ర మంత్రితో సీఎం జగన్ సమావేశమైయ్యారు. రాష్ట్రానికి సంబంధించి పలు అంశాలపై చర్చించడంతో పాటు వినతి పత్రాన్ని సమర్పించారు. అదే విధంగా ఇటీవల కేంద్రం రూ.10 వేల కోట్లు రెవెన్యూ లోటు నిధులు విడుదల చేయడంపై కేంద్ర మంత్రికి ధన్యవాదాలు తెలియజేశారు సీఎం జగన్.

రేపు (శనివారం) ఢిల్లీ వేదికగా జరుగుతున్న నీతి ఆయోగ్ సమావేశంలో సీఎం జగన్ పాల్గొననున్నారు. ఎల్లుండి కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొననున్నారు. అనంతరం అమరావతి తిరుగు ప్రయాణం అవుతారు. కాగా, నీతి ఆయోగ్ సమావేశాన్ని, కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ప్రధాన ప్రతిపక్ష పార్టీలు బహిష్కరించాయి. కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ప్రతిపక్షాలు బహిష్కరించడాన్ని ఏపీ సీఎం జగన్ తప్పుబట్టారు. ప్రధాని మోడీకి అభినందనలు తెలియజేశారు. ఆ మేరకు మొన్న ట్వీట్ చేశారు సీఎం జగన్.

తొలుత ఢిల్లీ చేరుకున్న సీఎం వైఎస్ జగన్ కు విమానాశ్రయంలో ఎంపీ విజయసాయిరెడ్డి సహా ఇతర వైసీపీ ఎంపీలు స్వాగతం పలికారు. ఈ మేరకు విజయసాయి రెడ్డి తన ట్విట్టర్ ఖాతాలో ఫోటోలను పోస్టు చేశారు.
అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పై వాడివేడిగా వాదనలు.. విచారణ రేపటికి వాయిదా
Received Hon’ble CM @ysjagan garu at the Delhi Airport today along with my colleague MPs & other Sr. Leaders. HCM reached the national capital to attend the historic inauguration ceremony of the New Parliament Building. pic.twitter.com/KlnQxF5thv
— Vijayasai Reddy V (@VSReddy_MP) May 26, 2023