NewsOrbit
Featured ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ బిగ్ స్టోరీ

ప్రత్యేక హోదా అంశాన్ని వదిలిపెట్టని వైఎస్ జగన్..ఢిల్లీ వెళ్లిన ప్రతి సారి వినతి

ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాదు. కేంద్రం ఇవ్వదు అని తెలిసినా ఏపి ముఖ్యమంత్రి cm వైఎస్ జగన్ మోహనరెడ్డి ys jagan mohan reddy ఆ అంశాన్ని మాత్రం వదలివేయడం లేద. పట్టువదలని విక్రమార్కుడిలా ఢిల్లీకి వెళ్లిన ప్రతి సారి కేంద్ర పెద్దలకు ప్రత్యేక హోదా అంశంపై వినతిని ఇస్తూనే ఉన్నారు.

ప్రత్యేక హోదా అంశాన్ని వదిలిపెట్టని వైఎస్ జగన్..ఢిల్లీ వెళ్లిన ప్రతి సారి వినతి
ap cm YS jagan did not leave special status issue

రాష్ట్ర విభజన సమయంలోనే యుపీఏ ప్రభుత్వం ఆయిదేళ్ల పాటు ఏపికి ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చింది. ఆనాడు బీజెపీ నేతలు అయిదేళ్ళు కాదు పదేళ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం ఏపికి ప్రత్యేక హోదా అంశాన్నిపూర్తిగా పక్కన పెట్టేసింది. నాడు పార్లమెంట్ లోనూ బయట వైసీపీ ప్రత్యేక హోదాకై తీవ్ర స్థాయిలో నిరసనలు వ్యక్తం చేసింది. నాడు ఎన్‌డీఏలో తెలుగుదేశం భాగస్వామిగా ఉండటంతో చంద్రబాబును ప్రత్యేక హోదాకు బదులు ప్రత్యేక ప్యాకేజీకి కేంద్రం ఒప్పించింది. పోలవరం ప్రాజెక్టు కోసం చంద్రబాబు ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారంటూ వైసీపీ తీవ్ర స్థాయిలో విమర్శించింది. అనంతరం ఎన్టీఏ నుండి తెలుగుదేశం బయటకు వచ్చిన తరువాత ప్రత్యేక హోదా ఉద్యమాన్ని పెద్ద ఎత్తున లేవనెత్తింది. ఎన్నికల సమయంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ తాము అధికారంలోకి వస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తామని కూడా ప్రజలకు వాగ్దానం చేశారు.

ap cm YS jagan did not leave special status issue

ఏపిలో 25 పార్లమెంట్ స్థానాలకు గానూ 22 స్థానాలు వైసీపీ సాధించినా ప్రత్యేక హోదా గురించి కేంద్రంపై పూర్తి స్థాయిలో ఒత్తిడి తీసుకురావడం లేదు. అధికారంలోకి వచ్చిన కొత్తలోనే వైఎస్ జగన్ ప్రత్యేక హోదా విషయంలో తన నిస్సహాయతను వ్యక్తం చేశారు. “కేంద్రం మనపై అధారపడి లేదు, ప్రాంతీయ పార్టీల సహకారం అవసరం లేకుండానే బీజెపీకి ఫుల్ ప్లెజ్డ్ మెజార్టీ ఉంది. మనం ప్రత్యేక హోదా కోసం గట్టిగా డిమాండ్ చేసి సాధించే పరిస్థితి లేదు, కేంద్రాన్ని ప్రత్యేక హోదా అడుగుతూనే ఉంటాము” అని జగన్ చెప్పారు.

గతంలో జరిగిన నీటి ఆయోగ్ సమావేశంలోనూ సీఎం జగన్ ఏపికి ప్రత్యేక హోదా ఆవశ్యకతను వివరించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరించి చెప్పారు. అధిక ఆదాయాన్ని ఇచ్చే హైదరాబాద్ తెలంగాణకు వెళ్లడంతో ఏపి తీవ్రంగా నష్టపోయిందనీ, 59 శాతం జనాభా ఉన్న రాష్ట్రానికి 47 శాతం మాత్రమే ఆదాయాన్ని పంచారని పేర్కొన్నారు. ఐటి రంగం హైదరాబాద్ లో కేంద్రీకృతం కావడంతో ఏపి వ్యవసాయ అధారిత రాష్ట్రంగా మిలిగిపోయిందన్నారు. తెలంగాణ కంటే ఏపి తలసరి ఆదాయం చాలా తక్కువగా ఉందని ఈ నష్టాన్ని పూడ్చడానికి అనాటి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ప్రత్యేక హోదా హామీ ఇచ్చిందని జగన్ గుర్తు చేశారు. అయితే ఆ హామీని అప్పటి అధికార, విపక్ష పార్టీలు నిలబెట్టుకోలేదని అన్నారు. ప్రత్యేక హోదా మాత్రమే రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని కొంత మేర పూడ్చగలదని జగన్ అంటున్నారు.

ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమని బీజెపీ నేతలు చెబుతూనే ఉన్నారు. కేంద్రం కూడా ఈ విషయాన్ని పూర్తిగా పక్కడ పడేసింది. రాష్ట్రంలోని ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశంతో సహా ఇతర రాజకీయ పక్షాలు ప్రత్యేక హోదా ఊసు ఎత్తడం లేదు. కానీ జగన్ మాత్రం ఢిల్లీకి వెళ్లిన ప్రతి సారి కేంద్ర పెద్దలకు ఇతర అంశాలతో పాటు ప్రత్యేక హోదా గురించి ఓ వినతి పత్రాన్ని అందజేస్తూ ఉన్నారు. తాజాగా మంగళవారం రాత్రి కేంద్ర హోంశాఖ మంత్ర అమిత్ షాతో భేటీలోనూ పోలవరం ప్రాజెక్టు బకాయిలు, పెరిగిన అంచనా వ్యయం తదితర అంశాలతో పాటు ఏపికి ప్రత్యేక హోదాపై వినతి పత్రం ఇవ్వడం గమనార్హం.

ఇది కూడా చదవండి..అమిత్ షాతో ఏపి సీఎం జగన్ భేటీ… కీలక అంశాలపై చర్చ

 

 

author avatar
sharma somaraju Content Editor

Related posts

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!

ఆ వైసీపీ నాయ‌కుడికి మేం జై కొట్ట‌లేం… కూట‌మి ప్ర‌యోగం విక‌టిస్తోందా..?