NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP CM YS jagan: ఏపి సీఎం వైఎస్ జగన్ కీలక నిర్ణయం..! ఆ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రావద్దంటూ సూచన..!!

AP CM YS jagan: ఏపిని వర్షాలు ముంచెత్తుతున్నాయి. చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాలు భారీ వర్షాలకు అతలాకుతలం అవుతున్నాయి. పలు గ్రామాలు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి. రోడ్లు కోతలకు గురైయ్యారు. వంతెనలు కూలిపోతున్నాయి. భారీగా ప్రాణనష్టం, ఆస్తినష్టం సంభవించింది. పంట పొలాలు మునిగిపోయాయి. విద్యుత్ స్తంభాలు పడిపోయి కరెంటు సరఫరా నిలిచిపోవడంతో పలు గ్రామాల్లో అంధకారం తాండవిస్తోంది. బాధితులు కట్టు బట్టలతో మిగిలారు. ఇళ్లలోని వస్తువులు వరద నీటితో కలిసిపోయాయి. పలు కాలనీలు ఇంకా వరద ముంపులోనే ఉన్నాయి. భారీ వర్షాల కారణంగా ఇప్పటి వరకూ రాష్ట్రంలో 27 మంది మృతి చెందారు, వరదల కారణంగా పలువురు గల్లంతు అయ్యారు. గల్లంతు అయిన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. పలు చూట్ల భవనాలు కూలుతున్నాయి. నిన్న వరద ముంపు ప్రాంతాలను ఏరియల్ సర్వే చేసిన ఏపి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి నేడు కీలక నిర్ణయం తీసుకున్నారు.

AP CM YS jagan directs mlas to provide relief to flood victims
AP CM YS jagan directs mlas to provide relief to flood victims

 

AP CM YS jagan: వరద సహాయక చర్యల్లో ఎమ్మెల్యేలు పాల్గొనాలి

ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో అన్ని జిల్లాల నుండి ఎమ్మెల్యేలు అమరావతికి చేరుకున్నారు. ఈ నెల 26వ తేదీ వరకూ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం జగన్మోహనరెడ్డి వరద ప్రాంతాల ఎమ్మెల్యేలకు కీలక సూచన చేశారు. ఆ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రానక్కరలేదని చెప్పారు. వరద ప్రాంతాల్లో సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలని జగన్ వారికి పిలుపునిచ్చారు. ఇన్ చార్జి మంత్రులు, జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు సహాయక చర్యలను పర్యవేక్షించాలని కోరారు. గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజల తక్షణ సాయం అందేలా చూడాలని ఆదేశించారు. ప్రధానంగా పారిశుద్ద్య పనులు, డ్రైనేజీల పూడికతీత పనులు చేపట్టాలని సూచించారు. రేషన్ సరుకుల పంపిణీ, నష్టంపై పక్కాగా అంచనా వేయడంపై దృష్టి సారించాలని సీఎం జగన్ స్పష్టం చేశారు. ప్రజా ప్రతినిధులు అధికారులతో సమన్వయం చేసుకుంటూ ప్రజలకు అండగా ఉండాలని సీఎం సూచించారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!

నెల్లూరు సిటీ: ఇక్క‌డ గెలిచే రారాజు ఎవ‌రు… కిరీటం ఎవ‌రికి..?

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju