29.2 C
Hyderabad
February 9, 2023
NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

 చిరు వ్యాపారుల కుటుంబాలల్లో సంక్రాంతి పండుగకు ముందే సంతోషాన్ని నింపిన సీఎం జగన్

Share

ఏపిలోని దాదాపు 3 లక్షల 95వేల చిరు వ్యాపారుల కుటుంబాలకు జగనన్న తోడు సాయం అందించి సంక్రాంతి పండుగ ముందే వారిలో సంతోషాన్ని నింపారు సీఎం జగన్. ఈ పథకం కింద ఒక్కొక్కరికి రూ.10వేల వంతున ఏపీ సీఎం వైఎస్ జగన్ ఇవేళ బటన్ నొక్కి విడుదల చేశారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ పాదయాత్ర సమయంలో రాష్ట్రంలోని చిరు వ్యాపారుల కష్టాలను దగ్గరి నుండి చూశాననీ, అందుకే వారి కష్టాలను తీర్చేందుకు జగనన్న తోడు పథకం తీసుకురావడం జరిగిందని చెప్పారు. చిరు వ్యాపారులు పెట్టుబడి కోసం ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో వడ్డీ, గ్యారంటే లేకుండా రుణాలు అందిస్తున్నామన్నారు.

AP CM YS Jagan

 

రు వ్యాపారులు బ్యాంకులకు చెల్లించాల్సిన వడ్డీని ప్రభుత్వం రీయింబర్స్ చేస్తుందని, ఆ మొత్తాన్ని వారి ఖాతాల్లో నేరుగా జమ చేస్తుందని తెలిపారు. ఇప్పటి వరకూ 15,31,347 మందికి రూ.2,406 కోట్ల వడ్డీ లేని రుణాలు అందించినట్లు వివరించారు సీఎం జగన్. గత ఆరు నెలల వ్యవధిలో ఈ పథకం కింద ఇచ్చిన రుణాలకు సంబంధించి వడ్డీ రూ.15.17 కోట్లను రీయింబర్స్ మెంట్ చేసినట్లు తెలిపారు. ఈ పథకానికి సంబంధించి రుణాలను సక్రమంగా చెల్లించిన 13.28 లక్షల మందికి రూ.63 కోట్ల కు పైగా వడ్డీ తిరిగి చెల్లించామని చెప్పారు. చిరు వ్యాపారులు సమాజానికి ఎంతో మేలు చేస్తున్నారని అన్నారు.

జగనన్న తోడు పథకం అందని చిరు వ్యాపారులు మరో సారి ధరఖాస్తు చేసుకోవచ్చని సీఎం చెప్పారు. ముందుగా పలువురు చిరు వ్యాపారులు ఈ పథకం వల్ల తాము ఎంతో బాగుపడ్డామనీ వివరించగా, సీఎం జగన్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. వివిధ జిల్లాల కలెక్టరేట్ల నుండి కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ లు, అధికారులు, లబ్దిదారులు పొల్గొన్నారు.

ప్రధాన మంత్రి మోడీ హైదరాబాద్ పర్యటన వాయిదా


Share

Related posts

Nani: నానికి షాకిచ్చిన వరుణ్ తేజ్..తలలు బాదుకుంటున్న నిర్మాత..?

GRK

RGV: పనిలో పస తగ్గిన వివాదాల వర్మ, వేదాలు వల్లించడం ఆపట్లేదు మరి?

Ram

PK in Congress: కాంగ్రెస్ లోకి పీకే..! జగన్, కేసిఆర్ లతో కాంట్రక్టు మాయ..!

Srinivas Manem