NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP CM YS Jagan:  ట్రాక్టర్ నడిపి రైతులను ఉత్సాహపర్చిన సీఎం వైఎస్ జగన్

AP CM YS Jagan: వైఎస్ఆర్ యంత్ర సేవా పథకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. గుంటూరు జిల్లాలో ని చుట్టగుంట వద్ద వైఎస్అర్ యంత్ర సేవ పథకం రాష్ట్ర స్థాయి మెగా మేళాలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి పాల్గొన్నారు. రైతు గ్రూపులకు మంజూరైన ట్రాక్టర్లు, కంబైన్డ్ కోత యంత్రాల పంపిణీ కార్యక్రమానికి జెండా ఊపి ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్ స్వయంగా ట్రాక్టర్ నడిపి రైతులను ఉత్సాహపరిచారు.  ఈ కార్యక్రమంలో 3,800 ట్రాక్టర్లు, 320 క్లస్టర్ స్థాయి తంత్ర సేవా కేంద్రాలకు 320 హార్వెస్టర్ లను పంపిణీ చేశారు. అదే విధంగా 5,260 రైతు గ్రూపు బ్యాంకు ఖాతాలకు రూ.175 కోట్ల సబ్సిడీని సీఎం జగన్ జమ చేశారు.

AP CM YS Jagan Distributes Tractors to Farmers
AP CM YS Jagan Distributes Tractors to Farmers

AP CM YS Jagan: ట్రాక్టర్ల ఎంపికలో రైతులకు స్వేచ్చ

ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ ప్రతి గ్రామంలోనూ విత్తనం నుండి పంట అమ్మకం వరకూ ప్రతి దశలోనూ రైతులకు తోడుగా ఉండేందుకు రైతు భరోసా కేంద్రాలను నిర్మించామన్నారు. అర్బీకేలు ప్రతి అడుగులోనూ రైతులకు తోడుగా ఉంటోందన్నారు. 10,750 రైతు భరోసా కేంద్రాల ద్వారా గ్రామాల్లోనే రైతులకు 40 శాతం సబ్సిడీతో వ్యవసాయ పనిముట్లు అన్నీ అందిస్తున్నామని చెప్పారు. గత చంద్రబాబు ప్రభుత్వంలో అరకొర ట్రాక్టర్ లు ఇచ్చి చేతులు దులుపుకున్నారనీ, ఇవి కూడా రైతులు ఎవరూ నేరుగా ట్రాక్టర్ లను ఆర్డర్ లు ఇచ్చి పొందలేదనీ, మంత్రులు, ఎమ్మెల్యేలు డీలర్లతో కుమ్మక్కు అయి స్కామ్ లు చేశారని విమర్శించారు. ఇప్పుడు నేరుగా రైతులు ఇష్టం వచ్చిన ట్రాక్టర్ లు కొనుగోలు చేసుకునేందుకు స్వేచ్చ ఇచ్చామని సీఎం అన్నారు. ఈ తేడాను రైతులు గమనించాలని సీఎం జగన్ కోరారు. చిన్న సన్నకారు రైతులకు వైసీపీ యంత్ర సేవా పథకం ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.

జిందాల్ పవర్ ప్లాంట్ ప్రారంభం

ఈ కార్యక్రమం అనంతరం పల్నాడు జిల్లా యర్లపాడు మండలం కొండవీడు గ్రామ రెవెన్యూ పరిధిలో రూ.345 కోట్ల వ్యయంతో నిర్మించిన జిందాల్ పవర్ ప్లాంట్ ను సీఎం జగన్ ప్రారంభించారు. గంటకు 15 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యంతో పని చేసేలా దీన్ని తీర్చిదిద్దారు. రోజుకు 1600 టన్నుల చెత్తను ఉపయోగించే సామర్ద్యం ప్లాంట్ కు ఉంది. మొత్తం తొమ్మిది నగరాల నుండి చెత్తను సేకరించనున్నారు. ఇప్పటికే ప్లాంట్ లో ట్రయల్ రన్ నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం రోజుకు 1200 టన్నుల చెత్త ప్లాంట్ కు వస్తొంది. ఈ ప్లాంట్ ను ప్రారంభించిన అనంతరం అక్కడి ఆవరణలో మొక్కలు నాటారు సీఎం వైఎస్ జగన్. ఈ కార్యక్రమాల్లో జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, వైసీపీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!

నెల్లూరు సిటీ: ఇక్క‌డ గెలిచే రారాజు ఎవ‌రు… కిరీటం ఎవ‌రికి..?

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju