NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

సంఘ నేతల బహిష్కరణ పిలుపు బుట్టదాఖలు .. సీఎం జగన్ చేతుల మీదుగా ఉత్తమ ఉపాధ్యాయులకు సత్కారం

గురు పూజోత్సవాన్ని బహిష్కరించాలని పలు ఉపాధ్యాయ సంఘాలు పిలుపునిచ్చాయి. సన్మానాలకు, సత్కారాలకు దూరంగా ఉండాలని సంఘ నేతలు ఉపాధ్యాయులకు విజ్ఞప్తి చేశారు. గురుపూజోత్సవాన్ని బహిష్కరిస్తున్నట్లు ఉపాధ్యాయ సంఘాలు జిల్లా విద్యాశాఖాధికారులు, మండల విద్యాశాఖ అధికారులకు నోటీసులు కూడా ఇచ్చారు. అయితే ఉపాధ్యాయ సంఘ నేతల పిలుపు బుట్టదాఖలైంది. భారత మాజీ రాష్ట్రపతి, విద్యావేత్త డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణమూర్తి జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో విజయవాడ ఏ కన్వెన్షన్ సెంటర్ నందు నిర్వహించిన గురుపూజోత్సవ వేడుకలకు పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు హజరైయ్యారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి చేతుల మీదుగా ఉత్తమ ఉపాధ్యాయులు పురస్కారాలను అందుకున్నారు. రాష్ట్రంలోని 176 మంది ఉపాధ్యాయులు, అధ్యాపకులు ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలను సీఎం జగన్ ప్రధానం చేసి సత్కరించారు.

Teachers day celebrations CM Jagan
Teachers day celebrations CM Jagan

సీఎం వైఎస్ జగన్ తో భేటీ అయిన టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లిమిటెడ్ ప్రతినిధి బృందం..ఎందుకంటే..?

తొలుత డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ విగ్రహానికి సీఎం వైఎస్ జగన్ పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం సీఎం జగన్ .. అధ్యాపకుల గొప్పతనాన్ని కొనియాడారు. విద్యార్ధులను తీర్చిదిద్దడంలో కీలక పాత్ర గురువులదేనన్నారు. ఉపాధ్యాయులకు శిఖరం వంటి వ్యక్తి సర్వేపల్లి రాధాకృష్ణన్ అని అన్నారు. సాన పెట్టకపోతే వజ్రమైనా కూడా రాయితోనే సమానం అని చెప్పారు. విద్యార్ధులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే శక్తి ఉపాధ్యాయులకే ఉందని అన్నారు. మంచి టీచర్ల వ్యవస్థను మొత్తం మార్చగలరని అన్నారు. తనకు విద్య నేర్పిన గురువులకు రుణ పడి ఉంటానన్నారు. విద్యార్ధుల భవిష్యత్తును దృష్టి లో పెట్టుకుని విద్యారంగంలో అనేక సంస్కరణలు తీసుకువచ్చామన్నారు.

Teachers day celebrations CM Jagan

సీఎంగా విద్యాశాఖ పైనే ఎక్కువగా సమీక్షలు చేశానని చెప్పారు. పేదలకు మంచి చదువులు అందించాలన్నదే సంస్కరణ లక్ష్యమని అన్నారు. టీచర్ల పదవీ విరమణ వయసును 62 ఏళ్ల కు పెంచామన్నారు. ఎస్ జీటీలను స్కూల్ అసిస్టెంట్లు గా ప్రమోట్ చేశామని చెప్పారు. ఉపాధ్యాయ పెన్షన్ విషయంలోనూ చిత్తశుద్దితో పని చేస్తున్నామన్నారు. ఉపాధ్యాయులను ఇబ్బందులు పెట్టే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి లేదని అన్నారు. టీచర్ల ను సైతం రెచ్చగొట్టేందుకు ప్రతిపక్షం ప్రయత్నిస్తుందని విమర్శించారు సీఎం జగన్. ఎల్లో మీడియా కూడా రెచ్చగొట్టేలా కుట్రలు చేస్తొందని ఆరోపించారు. కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, విద్యాశాఖ ఉన్నతాధికారులు, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.

Teachers day celebrations CM Jagan
Teachers day celebrations CM Jagan

ఏపిలో ఉపాధ్యాయులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్

author avatar
sharma somaraju Content Editor

Related posts

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju