NewOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YS Jagan: ఆ ప్రాంత ప్రజలకు ఇచ్చిన ఆ హామీని నెరవేర్చిన ఏపీ సీఎం వైఎస్ జగన్

Share

YS Jagan:  ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రజలకు ఇస్తున్న కొన్ని హామీల విషయంలో యుద్ద ప్రాతిపదికన అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఆ హమీని నెరవేరుస్తున్నారు. ఇటీవల సీఎం వైఎస్ జగన్ వరద బాధితులను పరామర్శించేందుకు అల్లూరు సీతారామరాజు జిల్లా చింతూరు వెళ్లిన సంగతి తెలిసందే. ఆ సందర్భంలో చింతూరు కేంద్రంగా రెవెన్యూ డివిజన్ ఏర్పాటు అవశ్యకతను అక్కడి ప్రజల ఆకాంక్షను నేతలు సీఎం దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన సీఎం జగన్.. చింతూరు లో రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తానని హమీ ఇచ్చారు. తాజాగా ఆ హామీని నెరవేరుస్తూ నేడు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏటిపాక, చింతూరు, కూనవరం, వర రామచంద్రాపురం మండలాలను కలిపి చింతూరు రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేసింది ప్రభుత్వం.

AP CM YS Jagan

 

Breaking: హైదరాబాద్ ఎన్నికల కార్యాలయంలో ప్రొఫెసర్ కోదండరామ్ మౌనదీక్ష

Advertisements

చింతూరు రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయడంతో రాష్ట్రంలో రెవెన్యూ డివిజన్ ల సంఖ్య 74కి చేరింది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఇప్పటి వరకూ పాడేరు, రంపచోడవరం రెండు రెవెన్యూ డివిజన్లు మాత్రమే ఉన్నాయి. తాజాగా చింతూరు కేంద్రంగా మరో రెవెన్యూ ఏర్పాటు కావడంతో జిల్లాలో రెవెన్యూ డివిజన్ సంఖ్య మూడుకు పెరిగింది. ఇప్పటికే రాష్ట్రంలో పరిపాలనా సౌలభ్యం కోసం ప్రభుత్వం 13 జిల్లా లుగా ఏపిని 26 జిల్లాలుగా మార్చిన సంగతి తెలిసిందే. చింతూరు కేంద్రంగా రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయడంతో దాని పరిధిలోని మండలాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆ ప్రాంత ప్రజలకు సుదీర్ఘ కాలంగా ఉన్న డిమాండ్ పరిష్కరించినట్లు అయ్యింది.

Anand Mahindra: రిషి సునాక్ ఎన్నికపై సోషల్ మీడియాలో వైరల్ అయిన అనంద్ మహీంద్రా ఆసక్తికర ట్వీట్


Share

Related posts

WhatsApp: ఇక నుండి వాట్సాప్ లో కూడా ఇంస్టాగ్రామ్, ఫేస్ బుక్ ఫీచర్స్ తెలియజేసిన మార్క్ జుకర్ బర్గ్…!!

sekhar

Maharashtra Politic’s: బీజేపీ ఎంపీ నవనీత్ రానా ఆమె భర్త రవి రానా నీ అరెస్టు చేసిన మహారాష్ట్ర పోలీసులు..!!

sekhar

అధికార పార్టీ ఎమ్మెల్యేలకు తలనొప్పిగా మారిన చెత్త పన్ను వసూళ్లు .. సీఎంను కలిసేందుకు సిద్ధమవుతున్న ఇద్దరు మాజీ మంత్రులు

somaraju sharma