NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

YS Jagan : ఏపి సీఎం వైఎస్ జగన్ కరోనా వ్యాక్సిన్ ఎప్పుడు వేయించుకుంటున్నారంటే..?

YS Jagan : దేశంలో కరోనా కేసులు తగ్గినట్లే తగ్గి మళ్లీ ఉదృత మవుతున్న నేపథ్యంలో వ్యాక్సినేషన్ విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఏప్రిల్ 1వ తేదీ నుండి 45 సంవత్సరాలు దాటిన వారికి కరోనా వ్యాక్సిన్ ఉచితంగా వేయడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని దేశ వ్యాప్తంగా ప్రజలు సద్వినియోగం చుసుకోవాలని కేంద్రం సూచించింది. ఈ నేపథ్యంలో ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కి కరోనా వ్యాక్సిన్ వేసుకోవడానికి సిద్ధమవుతున్నారు. వైఎస్ జగన్ 1972 డిసెంబర్ 21న జన్మించినందున ఆయన వయసు ఇప్పుడు 48 సంవత్సరాలు. 45 సంవత్సరాల వయస్సు దాటినందున వైఎస్ జగన్ ఏప్రిల్ 1వ తేదీన గుంటూరులోని భరత్ పేట వార్డు సచివాలయంలో వ్యాక్సిన్ వేయించుకోనున్నారు. ఇదే సందర్భంలో వార్డు సచివాలయాల్లో వాక్సిన్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.

ap cm YS Jagan guntur tour
ap cm YS Jagan guntur tour

ఏప్రిల్ 1వతేదీన సీఎం జగన్ గుంటూరు పర్యటన నేపథ్యంలో సోమవారం వైసీపీ రాజ్యసభ సభ్యుడు మోపిదెవి వెంకట రమణ, మేయర్ మనోహర్, ఎమ్మెల్యే మద్దాలి గిరి, జిల్లా అధికారులు ఏర్పాట్లు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మోపిదేవి వెంకట రమణ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో కరోనా నియంత్రణకు అన్ని చర్యలు చేపడుతున్నామన్నారు. ఆర్థిక భారం పడుతున్నా వ్యాాక్సినేషన్ లో ముందున్నామని అన్నారు. కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం ఏప్రిల్ 1వ తేదీ నుండి గ్రామ సచివాలయాల్లోకి అందుబాటులోకి తీసుకువస్తున్నామని తెలిపారు. అదే రోజు సీఎం వైఎస్ జగన్ కూడా కరోనా టీకా వేయించుకుంటారని తెలిపారు. వ్యాక్సిన్ పై ప్రజలు ఎటువంటి అపోహలు, భయాలు, ఆందోళనలు పెట్టుకోవాల్సిన పని లేదన్నారు. ప్రభుత్వ సూచనలు, సలహాలు ప్రజలకు అందరూ పాటించాలన్నారు.

ఏపిలోనూ రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. గడచిన 24 గంటల్లో 31,325 మందికి పరీక్షలు నిర్వహించగా 997 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. కరోనా కారణంగా అనంతపురం, చిత్తూరు, కర్నూలు, నెల్లూరు, విశాఖపట్నంలో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. గడచిన 24 గంటల్లో 282 మంది కోవిడ్ నుండి పూర్తిగా కోలుకుని ఆరోగ్య వంతులు అయ్యారని వైద్య ఆరోగ్య శాఖ పత్రికా ప్రకటన ద్వారా తెలిపింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 6,104 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

author avatar
sharma somaraju Content Editor

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!