ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి (జగన్ )మూడు రోజుల వైఎస్ఆర్ జిల్లా పర్యటన కొనసాగుతోంది. తన పర్యటనలో భాగంలో రెండవ రోజైన శనివారం ఉదయం సీఎం జగన్ .. ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్దకు చేరుకుని తన తండ్రి దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి సమాధి వద్ద నివాళులర్పించారు. అనంతరం ఇడుపులపాయ చర్చిలో జరిగే ప్రార్థనల్లో కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి పాల్గొన్నారు. అనంతరం అక్కడ నుండి బయలుదేరి పులివెందులలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు సీఎం జగన్. తొలుత విజయ హోమ్స్ వద్ద ఉన్న జంక్షన్ ను ప్రారంభించారు. అనంతరం కదిరి రోడ్డు జంక్షన్ విస్తరణ రోడ్డును, నూతన కూరగాయల మార్కెట్ ను సీఎం జగన్ ప్రారంభించారు.

తదుపరి మైత్రీ లేఅవుట్ ను, రాయలాపురం వంతెనను, వైఎస్ఆర్ బస్టాండ్ ను ప్రారంభించి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఆ తర్వాత నాడు – నేడు ద్వారా అభివృద్ధి చేసిన అహోబిలాపురం పాఠశాలను, మంచినీటి శుద్ది కేంద్రాన్ని సీఎం జగన్ ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమాల అనంతరం ఇడుపులపాయ చేరుకుని రాత్రికి అక్కడే బస చేస్తారు. రెపు (డిసెంబర్ 25) ఇడుపులపాయ ఎస్టేట్ నుండి పులివెందుల చేరుకుని సీఎస్ఐ చర్చిలో క్రిస్మస్ ప్రార్ధనల్లో కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొంటారు. ఆ తర్వాత పులివెందులలో బయలుదేరి మధ్యాహ్నానికి తాడేపల్లికి చేరుకుంటారు.
జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో గందరగోళం.. బీజేపీ కార్పోరేటర్ లపై మేయర్ ఆగ్రహం
