NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YSRCP: గడప గడపకు రివ్యూలో ఏపీ సీఎం వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు .. కార్యక్రమం నిర్వహించాల్సింది ఇలా అంటూ ..

YSRCP: ఏపి ముఖ్యమంత్రి, వైఎస్ జగన్మోహనరెడ్డి శుక్రవారం నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం వర్క్ షాప్ లో కీలక వ్యాఖ్యలు చేశారు. గడప గడపకు కార్యక్రమాన్ని త్వరగా ముగించడం కోసం కొందరు ఎమ్మెల్యేలు, ఇన్ చార్జిలు ఆదరాబాదరగా గ్రామాల్లో తిరుగుతూ మమ అని పిస్తున్నారు. దీంతో సీఎం జగన్మోహనరెడ్డి గడపగడపకు కార్యక్రమాన్ని ఏ విధంగా నిర్వహించానే దానిపై దిశానిర్దేశం చేశారు. ప్రతి సచివాలయం పరిధిలో కనీసం రెండు రోజులు .. రోజుకు కనీసం ఆరు గంటలు పాటు ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు తిరగాలని సీఎం జగన్ సూచించారు. అదే విధంగా ప్రతి ఇంటికి వెళ్లి అయిదు నిమిషాల వారితో గడిపి వారికి ప్రభుత్వం వల్ల కల్గిన ప్రయోజనాలను వివరించాలని చెప్పారు. మీకోసం చేస్తున్న ఈ ఎక్సైజ్ సైజ్ ను జాగ్రత్తగా క్వాలిటీగా ఓరియంటెడ్ గా చేయాలని సూచించారు. క్వాంటిటీ ఓరియెంటెడ్ గా చేయవద్దని చెప్పారు. ఎందుకంటే ఇది మీరు ప్రజలతో కనెక్ట్ అయ్యేగొప్ప కార్యక్రమం అని పేర్కొన్నారు. ఇప్పుడు ప్రజలకు కనెక్ట్ అయి మన్ననలు పొందితే రేపు గెలవడానికి దోహదపడుతుందన్నారు. తొందర పడవద్దు, ఎవరినో మభ్యపెట్టేందుకు చేయవద్దని అన్నారు. రెండు రోజులు కాకపోతే మూడు రోజులు చేయమని సూచించారు.

YS JAGAN

 

కొన్ని కోట్ల మంది మనపై ఆధారపడి ఉన్నారన్న విషయాన్ని ప్రజా ప్రతినిధులుగా మనం గుర్తు పెట్టుకోవాలన్నారు.సీఎం జగన్మోహనరెడ్డి. మనం చేయాల్సిన బాధ్యతలను మనం చేయకపోతే కొన్ని కోట్ల మంది నష్టపోతారన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న యుద్దం కులాల మధ్య కాదు, పేద వాడికి, పెత్తందారి మనస్థత్వం ఉన్న వాడికి మధ్య అని అన్నారు. క్లాస్ వార్ జరుగుతోందన్నారు. ప్రతి పేదవాడికి ప్రతినిధి ఎవరు అంటే మనమే. మనం నష్టపోతే పేదవాడు నష్టపోతాడని పేర్కొన్నారు. మనం అధికారంలోకి పొరబాటున రాలేదంటే రాష్ట్రంలో ఉన్న ఏ పేదవాడికి కూడా న్యాయం జరగదని అన్నారు. మోసంతో కూడిన రాజకీయాలు, ప్రజలను వాడుకుని ఉపయోగించుకుని వదిలివేసే రాజకీయాలు, వెన్నుపోటు రాజకీయాలు, అబద్దాల రాజకీయాలు, ప్రజల మీద ప్రేమ లేని రాజకీయాలు, పేద వాడి మీద అసలు ప్రేమ రాజకీయాలు వస్తాయని పేర్కొన్నారు. అందుకే దయచేసి అందరూ ధ్యాస పెట్టాలన్నారు.

Gadapa Gadapaku Mana Prabhutvam Workshop

 

ప్రతి ఇంటిలోనూ రెండు మూడు నిమిషాలు గడపాలని సూచించారు. ప్రతి ఇంటికి వెళ్లి వాళ్లతో ఆయిదు నిమిషాలు మాట్లాడితే మార్పు వస్తుందన్నారు. ఎన్నికలకు ముందు ఇంత సమయం (టైమ్) దొరకదన్నారు. ఇప్పుడు ప్రజలతో మమేకం అవ్వడానికి కావాల్సినంత సమయం ఉందని అన్నారు. ఎన్నికలకు ఇంకా 16 నెలలు ఉండగా, ప్రతి ఇంటికి అయిదు నిమిషాలు మీరు గడపలేకపోతే, అయిదు నిమిషాలు వారికి జరిగిన మంచిని గుర్తు చేస్తూ ఆశీర్వాదాలను తీసుకోలేకపోతే మీకు ఏరకంగా వారి సింపతీ వస్తుందని ప్రశ్నించారు. మనం గడపగడపకు ఎందుకు చేస్తున్నాము అనేది ఆలోచించాలన్నారు. మనం గుర్తు పెట్టుకోవాల్సింది మనం ప్రజా సేవకులం. మన చేతిలో అధికారాన్ని చెలాయించడం కోసం కాదన్నారు. ఎదిగే కొద్దీ ఒదగాలన్నారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

గుంటూరు వెస్ట్… ఈ టాక్ విన్నారా ‘ ర‌జ‌నీ ‘ మేడం… ‘ మాధ‌వి ‘కి అదే ఫుల్‌ ఫ్ల‌స్ అవుతోంది..!

ఏపీ కాంగ్రెస్‌లో ఆయ‌న ఎఫెక్ట్ టీడీపీకా.. వైసీపీకా… ఎవ‌రిని ఓడిస్తాడో ?

ముద్ర‌గ‌డ వ‌ర్సెస్ ముద్ర‌గ‌డ‌.. ఈ రాజ‌కీయం విన్నారా..?

విజయవాడ తూర్పున ఉదయించేది ఎవరు.. గ‌ద్దెను అవినాష్ దించేస్తాడా..?

YS Viveka Case: వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై తీర్పు రిజర్వు

sharma somaraju

YSRCP: మీ బిడ్డ అదరడు ..బెదరడు – జగన్

sharma somaraju

CM YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసును సమీక్షించిన సీఈవో ముఖేశ్ కుమార్ మీనా  

sharma somaraju

CM Jagan: సీఎం జగన్ పై హత్యాయత్నం కేసు .. నిందితుడి వివరాలు తెలియజేస్తే రూ.2లక్షల నజరానా

sharma somaraju

Rashmika Mandanna: త‌న కెరీర్ లో ర‌ష్మిక మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. అస్స‌లు గెస్ చేయ‌లేరు!

kavya N

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు సుప్రీం కోర్టులో దక్కని ఊరట

sharma somaraju

Love Guru: సినీ ప్రియుల‌కు బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఈ మూవీ చూస్తే మలేషియా, కశ్మీర్, ఊటికి ఫ్రీగా ఫ్యామిలీ ట్రిప్‌!

kavya N

Longest Run Movies: థియేట‌ర్స్ లో అత్య‌ధిక రోజులు ఆడిన టాప్ 5 తెలుగు సినిమాలు ఇవే..!!

kavya N

Janhvi Kapoor: ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్‌తో పాటు మ‌రో స్టార్ హీరోను మ‌డ‌తెట్టేసిన జాన్వీ క‌పూర్‌.. ఇంత స్పీడ్‌గా ఉందేంట్రా బాబు..?!

kavya N

Aishwarya Rajinikanth: రెండో పెళ్లికి రెడీ అవుతున్న ధ‌నుష్ మాజీ భార్య‌.. ఐశ్వ‌ర్య‌కు కాబోయే వ‌రుడు ఎవ‌రంటే?

kavya N

Nagarjuna-NTR: నాగార్జున – ఎన్టీఆర్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N