NewOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ఏపీలో మద్యం అమ్మకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

Share

రాష్ట్రంలో దశల వారీగా మద్య నిషేదం చేస్తామని ఎన్నికల ముందు మహిళలకు హామీ ఇచ్చి ఇప్పుడు జగన్ సర్కార్ మద్యం ఆదాయం ద్వారా వస్తున్న ఆదాయాన్ని చూపి వేల కోట్ల రూపాయల అప్పు చేస్తొందం టూ ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో రాష్ట్రంలో మద్యం అమ్మకాలు, ఆదాయంపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదాయాన్ని ఇచ్చే శాఖల ఉన్నతాధికారులతో సోమవారం సీఎం జగన్ తన క్యాంప్ కార్యాలయంలో సమావేశమైయ్యారు. ఈ సందర్భంలో సీఎం జగన్ మాట్లాడుతూ..రాష్ట్రంలో మద్యం అమ్మకాలు బాగా తగ్గాయన్నారు. బెల్ట్ షాపుల తొలగింపు, మద్యం పర్మిట్ రూమ్ ల రద్దు తో విక్రయాలు తగ్గాయని చెప్పారు. ధరల పెంపు వల్ల కూడా మద్యం వినియోగం తగ్గిందని తెలిపారు. అక్రమ మద్యం తయారీ, అమ్మకాలపై ఎస్‌ఈబీ ప్రత్యేక దృష్టి సారించాలని సీఎం ఆదేశించారు.

AP CM YS Jagan

 

అక్రమంగా జరుగుతున్న రవాణాపై ప్రత్యేక దృష్టి సారించామని, వాటిని నివారించడానికి తనిఖీలు ముమ్మరం చేస్తున్నామని అదికారులు వివరించారు. ఎస్‌ఈబీలో పరివర్తన కార్యక్రమం జరుగుతున్న తీరుపై సీఎం జగన్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. చేయూత, ఆసరా వంటి కార్యక్రమాలు ద్వారా వారికి ఊతమివ్వాలని, ప్రత్యామ్నాయ జీవనోపాధిని కల్పించాలని సీఎం.జగన్ సూచించారు. వారికి ఆదాయాలు వచ్చే దిశగా ఉపాధి ఉండాని. అప్పుడే మరలా అక్రమ మద్యం తయారీ వంటి కార్యక్రమాలకు దూరంగా ఉంటారని సీఎం చెప్పారు. గంజాయి, అక్రమ మద్యం కేసులుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. ఏజెన్సీలో గంజాయి నివారణ చర్యలు చేపడుతూనే అక్కడ కూడా ఉపాధి మార్గాలు కల్పించాలని తెలిపారు. వారికి ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ పట్టాలు ఉన్నాయో లేదో తనిఖీ చేసుకుని లేకపోతే అర్హులైన వారికి పట్టాలివ్వాలని సీఎం జగన్ చెప్పారు. తద్వారా పట్టాలు వచ్చిన రైతులకు రైతు భరోసా కూడా లభిస్తుందని తెలిపారు. వారికి విత్తనాలు, ఎరువులు అందించే కార్యక్రమాలు కూడా చేపట్టాలన్నారు. అప్పుడే ఆశించిన స్ధాయిలో మార్పు వస్తుందని అన్నారు. ఈ చర్యల ద్వారా అక్రమ మద్యం, గంజాయి సాగుల నుంచి వారు దూరమవుతారని తెలిపారు.

Advertisements

 

నాన్‌ ఆపరేషనల్‌ మైన్స్‌పై మరింత దృష్టి పెట్టాలని సీఎం అధికారులను ఆదేశించారు. నిరుపయోగంగా ఉన్న మైనింగ్‌ ఏరియాలో కార్యకలాపాలు మొదలయ్యేలా చూడాలని తెలిపారు. వాణిజ్య పన్నులశాఖ అధికారులు పన్ను చెల్లింపుదారులకు మరింత అవగాహన కలిగించాలని ఆదేశించారు. ఏపీలో అన్ని రంగాల్లో స్నేహపూర్వక వాతావరణం ఉందన్న విషయాన్ని స్పష్టం చేయాలన్నారు. అక్రమాలకు పాల్పడుతున్న ఏజెన్సీల పట్ల అప్రమత్తంగా ఉండాలనీ, అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పన్ను చెల్లింపుదారులకు చెల్లింపుల ప్రక్రియను మరింత సౌలభ్యంగా చేయాలని చెప్పారు. అవగాహన పెంచడంతో పాటు వారి అభ్యంతరాలను ఎప్పటికప్పుడు పరిష్కరించాన్నారు. దీనివల్ల చెల్లింపులు సకాలంలో జరుగుతాయని, పన్ను కట్టేవారికి కూడా చక్కటి సేవలు అందించినట్టు అవుతుందని తెలిపారు. ట్రేడ్‌ అడ్వైజరీ కమిటీ సమావేశాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు సీఎం జగన్.

ఏపి విభజన, అమరావతి కేసుల విచారణ వేరువేరుగానే.. విచారణ 28వ తేదీకి వాయిదా వేసిన సుప్రీం కోర్టు


Share

Related posts

బ్రేకింగ్ : హుటాహుటిన .. గుంటూరు బయలుదేరిన చంద్రబాబు ..??

sekhar

దీపావళి రోజు ఆ పని చేశారంటే రూ.లక్ష ఫైన్! మీ ఇష్టం మరి!

Teja

Priyanka arul mohan : ప్రియాంక అరుళ్ మోహన్ కి ఏకంగా ఇక్కడ మెగాస్టార్ అక్కడ సూపర్ స్టార్ అట..?

GRK