వరదలపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష .. కీలక ఆదేశాలు జారీ

Share

గోదావరి వరదలు, సహాయ కార్యక్రమాలపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. గోదావరి వరద ప్రవాహం, తాజా పరిస్థితులపై సీఎం జగన్ ఆరా తీశారు. సహాయక చర్యల గురించి అధికారులు వివరాలు వెల్లడించారు. సహాయక శిబిరాలు, బాధితుల తరలింపు వివరాలు తెలుసుకున్న సీఎం జగన్.. ఎక్కడా కూడా ప్రాణనష్టం ఉండకూడదని స్పష్టం చేశారు. అవసరమైన మేర సహాయక బృందాలను వినియోగించుకోవాలని ఆదేశించారు. మరో 24 గంటల పాటు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సీఎం జగన్ చెప్పారు. సహాయక శిబిరాల ఏర్పాటు, సౌకర్యాల కల్పన లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సేవలు నాణ్యంగా ఉండాలని సీఎం స్పష్టం చేశారు.

వైఎస్ జగన్: వరద బాధితులకు ఉచిత రేషన్

వరద బాధిత కుటుంబాలకు ఉచితంగా రేషన్ పంపిణీ చేయాలని ఆదేశించిన సీఎం జగన్.. యుద్దప్రాతిపదికన అన్ని కుటుంబాలకు చేర్చాలన్నారు. ప్రతి కుటుంబానికి 25 కేజీల బియ్యంతో పాటు కేజీ కందిపప్పు, కేజీ బంగాళా దుంపలు, కిలో పామాయిల్, కేజీ ఉల్లిపాయలు అందించాలని ఆదేశించారు. అదే విధంగా బాధితులు పునరావాస శిబిరాల నుండి వెళ్లే సమయంలో కుటుంబానికి రూ.2వేలు లేదా వ్యక్తికి రూ.వెయ్యి చొప్పున సాయంగా అందించాలన్నారు. ఈ పనులపై అధికారులు అత్యదిక ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు. అదే విధంగా వరద పరిస్థితిపై ప్రతి గంటకూ తనకు నివేదించాలని సీఎం జగన్ ఆదేశించారు.


Share

Recent Posts

తిన‌డానికి తిండి కూడా ఉండేదికాదు.. చాలా క‌ష్ట‌ప‌డ్డాం: నిఖిల్‌

విభిన్న‌మైన క‌థ‌ల‌తో ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తూ టాలీవుడ్‌లో త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్.. త్వ‌ర‌లోనే `కార్తికేయ 2`తో ప‌ల‌క‌రించ‌బోతున్నాడు.…

35 mins ago

బీహార్ సీఎంగా 8వ సారి నితీష్ కుమార్ …ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఫిక్స్

బీహార్ ముఖ్యమంత్రిగా జేడీయూ నేత నితీష్ కుమార్ 8వ సారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటి వరకూ నితీష్ కుమార్ ఏడు సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం…

43 mins ago

స‌మ్మె ఎఫెక్ట్‌.. ప్ర‌భాస్‌కు అన్ని కోట్లు న‌ష్టం వ‌చ్చిందా?

గ‌త కొద్ది నెల‌ల నుండి సినిమాల ద్వారా వ‌చ్చే ఆదాయం బాగా త‌గ్గిపోవ‌డం, నిర్మాణ వ్య‌యం మోయ‌లేని భారంగా మార‌డంతో.. తెలుగు సినీ నిర్మాతలు త‌మ స‌మ‌స్య‌ల‌ను…

2 hours ago

బీజేపీకి మరో సారి షాక్ ఇచ్చిన బీహార్ సీఎం నితీష్ కుమార్ .. సీఎం పదవికి రాజీనామా

జేడీయూ నేత, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మిత్రపక్షమైన బీజేపీకి మరో సారి షాక్ ఇచ్చారు. ఎన్డీఏ నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన నితీష్ కుమార్ ఇప్పటి వరకు…

2 hours ago

ర‌ష్మిక నో చెప్పాక కృతి శెట్టి న‌టించిన‌ సినిమా ఏదో తెలుసా?

యంగ్ బ్యూటీ కృతి శెట్టి గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. త‌క్కువ స‌మ‌యంలోనే టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్‌గా మారిన ఈ ముద్దుగుమ్మ‌.. త్వ‌ర‌లోనే `మాచర్ల నియోజవర్గం`తో ప్రేక్ష‌కుల‌ను…

3 hours ago

స్ట్రీమింగ్‌కు సిద్ధ‌మైన న‌య‌న్‌-విగ్నేష్ పెళ్లి వీడియో.. ఇదిగో టీజ‌ర్!

సౌత్‌లో లేడీ సూప‌ర్ స్టార్‌గా గుర్తింపు పొందిన న‌య‌న‌తార ఇటీవ‌లె కోలీవుడ్ ద‌ర్శ‌క‌,నిర్మాత విఘ్నేష్ శివ‌న్‌ను పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టింది. దాదాపు ఆరేళ్ల…

4 hours ago