AP CM YS Jagan: మహమ్మారిపై పోరులో మా వంతు ఇదీ..! సీఎం జగన్‌ను కలిసిన కియా ఎండీ..!!

Share

AP CM YS Jagan: రాష్ట్రంలో కోవిడ్ సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతున్నది. నిత్యం 20 వేలకు పైగా కేసులు నమోదు అవుతున్నాయి. వందకు పైగా మరణాలు సంభవిస్తున్నాయి. కరోనా కట్టడికి ప్రభుత్వం కర్ప్యూ  అమలు చేస్తున్నది. కోవిడ్ నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నారు. కోవిడ్ బాధితులను ఆదుకునేందుకు ప్రతి జిల్లాలోని ఆసుపత్రుల్లో అదనపు పడకలు, ఆక్సిజన్ సిలెండర్లు ఏర్పాటు చేయడంతో పాటు కోవిడ్ కేర్ సెంటర్ లను ఏర్పాటు చేస్తున్నది. పలు కోవిడ్ కేర్ సెంటర్ లకు స్థానిక ప్రజా ప్రతినిధులు, ఎన్జీఓలు సహాయ సహకారాలను అందజేస్తున్నారు.  ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు పారిశ్రామిక వేత్తలు కూడా ఆర్థిక సాయం చేస్తున్నారు. కరోనాపై జరుగుతున్న పోరులో ప్రభుత్వానికి అండగా నిలిచేందుకు ముందుకు వస్తున్నారు.

AP CM YS Jagan: kia motors donates rs 5 crores cheque
AP CM YS Jagan: kia motors donates rs 5 crores cheque

తాజాగా కియా కార్ల పరిశ్రయ యాజమాన్యం భారీ సాయం అందజేసింది. ఏపి విపత్తు నిర్వహణ సంస్థకు రూ.5 కోట్లు విరాళంగా ఇచ్చింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డిని కియా ఇండియా ఎండి, సీఈఓ కూఖ్యున్ షిమ్ కలసి ఈ మేరకు చెక్కు అందజేశారు. ఈ విరాళంతో ఆక్సిజన్ కన్సంట్రేటర్లు, వెంటిలేటర్లు వంది వైద్య పరికరాలు కొనుగోలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మంత్రి మేకపాటి గౌతంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

అదే విధంగా హిందూస్థాన్ పెట్రోలియం కంపెనీ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్) కూడా తన వంతు సాయం అందజేసింది. విశాఖ జిల్లా కోవిడ్ రోగుల కోసం రూ.35 లక్షలు విరాళంగా అందజేసింది. ఈ నిధులతో కరోనా బాధితుల కోసం ఆక్సిజన్ సిలెండర్లు కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేసింది. విశాఖ జిల్లా కలెక్టర్ ను హెచ్‌పిసీఎల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కలిసి విరాళం చెక్కును అందజేశారు.


Share

Related posts

రైనా.. ప్లీజ్ వ‌చ్చేయ్‌.. ట్విట్ట‌ర్‌లో కోరుతున్న అభిమానులు..!

Srikanth A

Nagarjuna : నాగార్జున కి బాలీవుడ్ మల్టీస్టారర్ లో ఛాన్స్ ..కాని ఆ క్యారెక్టర్ ఒప్పుకుంటాడా..?

GRK

దాదాపు 17 సంవత్సరాల తర్వాత మళ్లీ వెండితెరపైకి రీఎంట్రీ ఇస్తున్న రేణుదేశాయ్..!!

sekhar