23.2 C
Hyderabad
December 6, 2022
NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ఏపికి మరో పరిశ్రమ .. రేపు సీఎం వైఎస్ జగన్ చేతుల మీద శంకుస్థాపన.. ఎక్కడంటే..?

Share

రాష్ట్రంలో వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రభుత్వంపై ఇటీవల కాలం వరకూ అభివృద్ధి పట్టించుకోవడం లేదని, కేవలం సంక్షేమ పథకాలతోనే నెట్టుకువస్తున్నారనే విమర్శ ఉంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలపైనే సీఎం జగన్ ఎక్కువగా దృష్టి పెట్టారు. ఇచ్చిన హామీ మేరకు సంక్షేమ పథకాలకు సంబంధించి నగదును క్యాలెండర్ ప్రకారం వారి ఖాతాలో జమ చేస్తూ వస్తున్నారు. కొద్ది నెలల నుండి పరిశ్రమలపైనా ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఈ క్రమంలోనే రెండు నెలల క్రితం అనకాపల్లి జిల్లా అచ్చుతాపురం సెజ్ లో ఏటీసీ టైర్ల పరిశ్రమను ప్రారంభించడంతో పాటు మరో 8 కంపెనీలకు శంకుస్థాపన చేశారు. ఈ మూడేళ్లలో 17 భారీ పరిశ్రమల ద్వారా రూ.39వేల కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు ప్రకటించారు. ఇప్పుడు తాజాగా మరో పరిశ్రమకు సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి శంకుస్థాపన చేయబోతున్నారు.

AP CM YS Jagan

 

తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలం గమ్మళ్లదొడ్డిలో ఏర్పాటు చేస్తున్న అస్సాగో ఇండస్ట్రియల్ ప్రైవేట్ లిమిటెడ్ (ఇథనాల్) పరిశ్రమకు శుక్రవారం (నవంబర్ 4న) సీఎం జగన్ శంకుస్థాపన చేస్తారు. ఈ కార్యక్రమానికి గానూ సీఎం జగన్ షెడ్యూల్ ఖరారు అయ్యింది. శుక్రవారం ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి లోని సీఎం నివాసం నుండి రోడ్డు మార్గం ద్వారా హెలిపాడ్ వద్దకు చేరుకుంటారు. 9.35 గంటలకు తాడేపల్లి నుండి హెలికాఫ్టర్ లో బయలుదేరి 10.30 గంటలకు గుమ్మళ్లదొడ్డి గ్రామం వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ కు చేరుకుంటారు. అనంతరం అక్కడ నుండి రోడ్డు మార్గంలో బయలుదేరి 10.40 గంటలకు అస్సాగో ఇండస్ట్రియల్ ప్రైవేటు లిమిటెడ్ ఏర్పాటు చేసిన సభా వేదికకు చేరుకుని శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు సీఎం జగన్.

AP High Court: మళ్లీ హైకోర్టుకు చేరిన రైతుల పాదయాత్ర పంచాయతీ.. నిరసనలపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు


Share

Related posts

జగన్ సహాయం లేకుండా ప్రధాని అయిపోదాం అనేనా కే‌సి‌ఆర్ ?

sekhar

Lions Saved Girl: కిడ్నాపర్ల నుండి బాలికను కాపాడిన సింహాలు!!

Naina

Chiranjeevi: చిరంజీవితో కమల్ హాసన్, సల్మాన్ ఖాన్..!!

sekhar