NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YSRCP: నేడు వైసీపీ నేతలతో జగన్ కీలక సమావేశం .. నేతల్లో గుబులు

YSRCP:  వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి ఈ రోజు మంత్రులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ చార్జీలు, రీజనల్ కోఆర్డినేటర్లతో సమావేశం కానున్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై సమీక్ష నిర్వహించనున్నారు. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల అనంతరం జరుగుతున్న ఈ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యాక్రమంతో పాటు నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితిపై జగన్ సమీక్షించనున్నారని చెబుతున్నారు. ఇవేళ 11 గంటల ప్రాంతంలో సమావేశం జరుగుతుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

YS Jagan

 

ఎమ్మెల్యేల పనితీరుపై తన వద్ద ఉన్న నివేదికల ఆధారంగా వారికి జగన్మహనరెడ్డి ఒకింత గట్టిగానే క్లాస్ తీసుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. జగన్మోహనరెడ్డి ఢిల్లీలో ఉండగానే ఈ సమావేశం ఏర్పాటునకు ఆదేశాలు ఇచ్చారంటే కీలక విషయాలను ఈ సమావేశంలో వెల్లడించే అవకాశం ఉన్నారని అనుకుంటున్నారు. ముందస్తు ఎన్నికలు, మంత్రివర్గ విస్తరణ వంటి కీలక అంశాలపై క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. కేబినెట్ విస్తరణ అనేది ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విచక్షణాధికారమనీ, ఆ విషయంలో మంత్రులుగా తాము మాట్లాడటం మంచిది కాదనీ బొత్స సత్యనారాయణ అంటే.. మంత్రి వర్గ విస్తరణ ఉందనీ, సోషల్ మీడియాలో వస్తున్నదంతా పుకారేననీ, ఈ కేబినెట్ తోనే వైసీపీ ఎన్నికలకు వెళుతుందని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం జగన్మోహనరెడ్డికి లేదని ఆ పార్టీ ముఖ్యనేతలు వెల్లడిస్తున్నారు.

అయితే నియోజకవర్గాల్లో ఫెర్ఫార్మెన్స్ సరిగా లేని ఎమ్మెల్యేల విషయంలో జగన్ కఠినంగా వ్యవహరిస్తారనీ, ఆ నియోజకవర్గాలకు నూతన సమన్వయకర్తలను నియమించే అవకాశం ఉందని అంటున్నారు. గత సమావేశాల్లోనూ జగన్మోహనరెడ్డి ఈ విషయంలో స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. దీంతో ఈ వేళ సమావేశంలో కొందరు నేతలు ఆందోళన చెందుతున్నారు. గడప గడపకు కార్యక్రమంలో భాగంగా కేటాయించిన ప్రత్యేక నిధులతో ఎవరెవరు ఎన్ని పనులు చేశారు, వాటి ప్రగతి సంబంధిత విషయాలను ఆరా తీస్తూ దీనిలో పూర్ ఫెర్ఫార్మెన్స్ కనబర్చిన నేతలకు గట్టిగానే క్లాస్ పీకే అవకాశం ఉందని అంటున్నారు. ఇదే క్రమంలో గృహసారధుల శిక్షణ కార్యక్రమాలు ఎంత వరకు పూర్తి అయ్యాయి. క్షేత్ర స్థాయిలో జరుగుతున్న కార్యక్రమాలపై సమీక్ష జరపడంతో పాటు “జగనన్నే మా భవిష్యత్తు’ ఈ నెల తేదీ నుండి ప్రారంభం కానున్న నేపథ్యంలో.. క్యాంపెయిన్ పై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు జగన్.

YS Jagan: ఈ నెల 6న చిలకలూరిపేటలో సీఎం జగన్ పర్యటన

author avatar
sharma somaraju Content Editor

Related posts

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju