ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

ప్రధాన మంత్రి మోడీతో ముగిసిన ఏపి సీఎం వైఎస్ జగన్ భేటీ

Share

ప్రధాన మంత్రి నరేేంద్ర మోడీతో ఏపి సీఎం వైఎస్ జగన్ భేటీ ముగిసింది. దాదాపు అరగంట పాటు ఈ భేటీ జరిగింది. ఈ భేటీలో పోలవరానికి నిధులు ఆలస్యం చేయకుండా విడుదల చేయాలని ప్రదాని మోడీని సీఎం కోరారు. నిర్వాసితులకు పునరావాస ప్యాకేజీ, అదే విధంగా ఏపికి సంబంధించిన పలు కీలక అంశాలపై ప్రధాని మోడీతో చర్చించి వినతి పత్రాన్ని అందించారు. సీఎం జగన్ తో ఈ కార్యక్రమంలో వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి పాల్గొన్నారు.

 

మధ్యాహ్నం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సీఎం జగన్ మర్యాదపూర్వకంగా కలవనున్నారు. అనంతరం కేంద్ర మంత్రి ఆర్ కే సింగ్ తో సీఎం జగన్ భేటీ అయి తెలంగాణ నుండి ఏపికి రావాల్సిన రూ.,6వేల కోట్ల విద్యుత్ బకాయిలపై చర్చించే అవకాశం ఉంది. అవసరం అయితే ఈ రాత్రికి ఢిల్లీలోనే బస చేసి రేపు మరి కొందరు కేంద్ర మంత్రులతోనూ సీఎం జగన్ కలిసే అవకాశం ఉన్నట్లు వైసీపీ వర్గాలు తెలిపాయి.

రామోజీ, జూనియర్ ఎన్టీఆర్ లకు కేంద్ర మంత్రి అమిత్ షా ప్రశంసలు


Share

Related posts

Potato Peel: బంగాళదుంప తొక్కలను పారేస్తున్నారా..!? ఇది తెలిస్తే అస్సలు పారెయ్యరు..!!

bharani jella

భూమా అఖిల‌ప్రియకు ఉన్న ఆఖ‌రి ఆప్ష‌న్ ఏంటో తెలుసా?

sridhar

దేశంలో మూడవ ర్యాంక్ సాధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ..!!

sekhar