భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ మూడు రోజుల తిరుపతి జిల్లా పర్యటన ముగించుకుని విజయవాడ చేరుకున్నారు. శుక్రవారం విజయవాడలో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఈ క్రమంలో భాగంగా గురువారం (ఇవేళ) రాత్రి విజయవాడ లో బస చేయనున్నారు. ఈ నేపథ్యంలో సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ బస చేసిన విజయవాడ నోవాటెల్ హోటల్ కు ఏపి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి చేరుకుని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంలో సీజేఐ చంద్రచూడ్ ను సీఎం జగన్ దుశ్సాలువాతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు.

అయితే విజయవాడ నోవాటెల్ హోటల్ లో సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ ను సీఎం వైఎస్ జగన్ మర్యాదపూర్వకంగా కలిసిన విషయాన్ని ఏపీ సీఎంఓ ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. అయితే మర్యాదపూర్వకంగా అని రాయాల్సింది మర్యాపూర్వకంగా కలుసుకున్న సీఎం జగన్ అని రాయడంతో మర్యాదపూర్వకంగా లో ‘ధ’ అనే అక్షరం మిస్ అవ్వడాన్ని నెటిజన్లు గుర్తించారు. ఈ అచ్చుతప్పును గుర్తించిన నెటిజన్ లు ట్వీట్ ను సరిచేయాలంటూ విజ్ఞప్తి చేశారు.

కాగా తిరుపతి పర్యటన ముగించుకున్న సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ కు సాదర వీడ్కోలు లభించింది. సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ కు విడ్కోలు పలికినవారిలో రిజిస్ట్రార జనరల్ ఆఫ్ ఏపి హైకోర్టు లక్ష్మణరావు, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, జిల్లా కలెక్టర్ కే వెంకట రమణ, రెడ్డి, ఎస్పీ పరమేశ్వరరెడ్డి, మూడవ అడిషనల్ జిల్లా జడ్జి వీర్రాజు, ప్రోటోకాల్ మెజిస్ట్రేట్ కోటేశ్వరరావు, శ్రీకాళహస్తి ఆర్ డీ ఓ రామారావు, డిప్యూటి కలెక్టర్ శ్రీనివాసులు, అడిషనల్ ఎస్పీ కులశేఖర్, ప్రోటోకాల్ సూపర్నిటెండెంట్ ధనుంజయ నాయుడు, జిల్లా బార్ కౌన్సిల్ ప్రెసిడెంట్ దినకర్ తదితరులు ఉన్నారు.
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) December 29, 2022