స్వాతంత్ర్యోద్యమ నే, సంస్కరణ వాది బాబూ జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ముఖ్యమంత్రి నివాసంలో సీఎం జగన్ నివాళులర్పించారు. ఈ సందర్బంగా బాబూ జగజ్జీవన్ రామ్ సేవలను సీఎం జగన్ కొనియాడారు. ఆయన దేశానికి అందించిన సేవలను ప్రశంసించారు.

ఈ కార్యక్రమంలో సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున, బాపట్ల ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి, సీఎంఓ అధికారులు పాల్గొన్నారు. నేతలు జగజ్జీవన్ రామ్ కు ఘన నివాళులర్పించారు. రాష్ట్ర వ్యాప్తంగానూ నియోజకవర్గ, మండల కేంద్రాల్లో పార్టీలు, సంస్థలు, సంఘాల ఆధ్వర్యంలో జగజ్జీవన్ రామ్ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించి, ఆయన చిత్రపటానికి, విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
BJP: బొమ్మలరామారం పీఎస్ వద్ద ఉద్రిక్తత .. బీజేపీ ఎమ్మెల్యే రఘునందనరావు అరెస్టు