రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం సోదరులకు ఏపి సర్కార్ ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసింది. విజయవాడ విద్యాధర పురంలోని మినీ స్టేడియంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమానికి సుమారు 15 వేల మంది హజరయ్యారు. ఈ విందులో పాల్గొన్న సీఎం వైఎస్ జగన్ ..ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. మీ అందరి ప్రార్ధనలు సఫలం కావాలని ఆకాంక్షించారు. దేవుని ఆశీస్సులతో అందరూ బాగుండాలని అన్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం అందరూ ప్రార్ధించాలని సూచించారు.

డిప్యూటి సీఎం అంజాద్ భాషా మాట్లాడుతూ .. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో మైనార్టీలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని అన్నారు. సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వంలో మైనార్టీలకు ఎంతో మేలు జరిగిందని తెలిపారు. మైనార్టీల సంక్షేమం కోసం ఎక్కువ నిధులు ఇచ్చిన రాష్ట్రం ఏపియేనని పేర్కొన్నారు. మైనార్టీ వర్గానికి డిప్యూటి సీఎం ఇచ్చిన ఘనత జగన్ దేనని ఆయన ప్రశంసించారు. గత ప్రభుత్వం మైనార్టీలను పట్టించుకోలేదని ఆయన విమర్శించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలు, అధికారులు పాల్గొన్నారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడంతో పాటు సీఎం జగన్ స్వయంగా పాల్గొనడంతో ముస్లిం సోదరులు సంతోషాన్ని వ్యక్తం చేశారు.
YS Viveka Murder Case: వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ రేపటికి వాయిదా
