24.2 C
Hyderabad
February 5, 2023
NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

మంత్రి ఆదిమూలపు సురేష్ కుటుంబాన్ని పరామర్శించిన సీఎం జగన్

Share

ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మంగళవారం ఎర్రగొండపాలెం లోని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కుటుంబాన్ని పరామర్శించారు. ఆదిమూలపు సురేష్ మాతృమూర్తి థేరీసమ్మ (85) సోమవారం వేకువజామున కన్నుమూశారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న థేరీసమ్మ హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారుం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. థేరీసమ్మ భౌతికకాయాన్ని నిన్న ఉదయం ప్రకాశం జిల్లా మార్కాపురం లోని మంత్రి నివాసానికి తీసుకువచ్చారు. సాయంత్రం స్థానిక జార్జి గ్రీన్స్ లో అంత్యక్రియలు నిర్వహించారు.

AP CM YS Jagan pays homage to adimulapu suresh mother

థేరీసమ్మకు ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు కాగా పెద్ద కుమారుడు సురేష్ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. రెండో కుమారుడు డాక్టర్ సతీష్.. జార్జి విద్యాసంస్థల కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆమె అల్లుడు తిప్పేస్వామి అనంతపురం జిల్లా మడకశిర ఎమ్మెల్యేగా ఉన్నారు. మార్కాపురంలోని జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల హెచ్ ఎంగా పని చేసిన థేరీసమ్మ ప్రస్తుతం ఆమె డాక్టర్ శామ్యూల్ జార్జి స్థాపించిన విద్యాసంస్థలకు చైర్ పర్సన్ గా కొనసాగారు. ఈ నేపథ్యంలో మంగళవారం మంత్రి ఆదిమూలపు సురేష్ నివాసానికి చేరుకున్న సీఎం వైఎస్ జగన్.. సురేష్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. థేరీసమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

కరోనాపై సమీక్షలో సీఎం జగన్ కీలక ఆదేశాలు


Share

Related posts

ఏడాది తరువాత జగన్ మీద చంద్రబాబు గెలుపు??

somaraju sharma

కలుషిత ఆహారంతో 28 మంది విద్యార్ధినులు అస్వస్థత .. తల్లిదండ్రులు ఆందోళన..ఎక్కడంటే..?

somaraju sharma

Anchor Suma: వెండి తెరపై సుమ రెమ్యునరేషన్ అన్ని కోట్లా ..?

Ram