NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP CM YS Jagan Polavaram Tour: పోలవరం ప్రాజెక్టును పరిశీలించిన సీఎం వైఎస్ జగన్

Advertisements
Share

AP CM YS Jagan Polavaram Tour:  ఏపి సీఎం వైఎస్ జగన్ పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. హెలికాఫ్టర్ ద్వారా ఏరియల్ సర్వే చేశారు. కాఫర్ డ్యామ్ పనులు, ఇప్పటి వరకు పూర్తైన పనుల వివరాలను సీఎం జగన్ కు అధికారులు వివరించారు. క్షేత్ర స్థాయిలో పనులు పరిశీలించిన అనంతరం ప్రాజెక్టు కాన్ఫరెన్స్ హాలులో అధికారులతో సమీక్ష నిర్వహించారు. పనులకు సంబంధించి అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు. పోలవరం పనుల పురోగతిపై అధికారులు ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఎగువ కాఫర్ డ్యామ్ వద్ద ఫోటో ఎగ్జిబిషన్ ను సీఎం జగన్ తిలకించారు. సీఎం జగన్ వెంట జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు, ప్రాజెక్టు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Advertisements
AP CM YS Jagan Polavaram Tour
AP CM YS Jagan Polavaram Tour

పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం రూ.12,911 కోట్లు మంజూరు చేసింది. ఈ క్రమంలో జగన్ ప్రాజెక్టు పనులు పరిశీలించారు. పోలవరం ప్రాజెక్టు తొలి దశ నిధు విడుదలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తొలి దశలో రూ.12,911 కోట్లు విడుదల చేసేందుకు కేంద్రం సిద్దమైంది. బిల్లుల చెల్లింపులో విభాగాల వారిగా పెట్టిన పరిమితులను తొలగించేందుకు కూడా కేంద్రం అంగీకరించింది

Advertisements

. 2013-14 అంచనా ధరలతో కాకుండా తాజా ధరల అధారంగా నిధులు చెల్లింపునకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ మేరకు కేంద్ర ఆర్ధిక శాఖ డైరెక్టర్ త్రివేది సోమవారం రాష్ట్ర్ జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కు లేఖ రాశారు. ఏపి ప్రభుత్వ విజ్ఞప్తులను కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆమోదించినట్లు లేఖలో స్పష్టం చేశారు. సీఎం జగన్ ఇప్పటి వరకూ అనేక పర్యాయాలు పోలవరం ప్రాజెక్టు నిధుల కోసం ఢిల్లీకి వెళ్లి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ లను కలిసి వినతి పత్రాలను ఇచ్చిన సంగతి తెలిసిందే. పదివేల కోట్ల అడ్ హక్ నిధులు ఇచ్చి ప్రాజెక్టు పూర్తి చేసేందుకు సహకరించాలని కోరారు.

బీర్ల లోడ్ వ్యాన్ బొల్తా .. బీరు బాటిళ్లను ఎగబడి ఎత్తుకెళ్లిన మందుబాబులు


Share
Advertisements

Related posts

Star Mahila : వంద ఎపిసోడ్స్ కు చేరుకున్న స్టార్ మహిళ ప్రోగ్రామ్? ఈ వారం గెస్టులు ఎవరో తెలుసా?

Varun G

BREAKING: ప్రమాణ స్వీకారం చేసిన 48 గంటలలో మంచు విష్ణు సంచలన నిర్ణయం ..!

Ram

L.Ramana: ఎల్‌.ర‌మ‌ణ‌… రాజ‌కీయ డైల‌మానా… తెలివైనా వ్యూహ‌మా?

sridhar