NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

జూనియర్ న్యాయవాదులకు లా నేస్తం నిధులు విడుదల చేసిన సీఎం జగన్

Share

వైఎస్ఆర్ లా నేస్తం పథకం కింద అర్హులైన 2,011 మంది జూనియర్ న్యాయవాదుల బ్యాంకు ఖాతాలోకి సీఎం వైఎస్ జగన్ బటన్ నొక్కి నిధులు విడుదల చేశారు. ఈ పథకం కింద రూ.1,00,55,000లను ఇవేళ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు జూనియర్ న్యాయవాదులను ఆదుకునేందుకు లానేస్తం పథకాన్ని తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. గత మూడేళ్లుగా లా నేస్తం నిధులు విడుదల చేస్తున్నామని తెలిపారు సీఎం వైఎస్ జగన్. జూనియర్ న్యాయవాదులకు ప్రభుత్వం తోడుగా ఉందని తెలిపేందుకు లా నేస్తం అని చెప్పారు. లా డిగ్రీ పూర్తి చేసిన తర్వాత తొలి మూడేళ్లు న్యాయవాదిగా స్థిరపడేందుకు లా నేస్తం కశ్చితంగా ఉపయోగపడుతుందని సీఎం పేర్కొన్నారు. ఇకపై ఏడాదికి రెండు సార్లు ఈ పథకాన్ని అమలు చేస్తామని సీఎం జగన్ ప్రకటించారు. ఇవేళ చెల్లించిన మొత్తంతో కలిపి ఇప్పటి వరకూ 4,248 మంది జూనియర్ న్యాయవాదులకు మూడున్నరేళ్లలో రూ.35.40 కోట్లు ఆర్ధిక సాయం అందించినట్లు అయ్యిందని తెలిపారు. ఈ సందర్భంగా వర్చువల్ గా సీఎం జగన్ జూనియర్ న్యాయవాదులతో మాట్లాడారు.

AP CM YS Jagan Release YSR Law Nestham Scheme Funds

 

ఇకపై ప్రతి ఆరు నెలలకు ఒక సారి లా నేస్తం ఇవ్వాలని పథకంలో మార్పులు తీసుకువచ్చినట్లు చెప్పారు. లా నేస్తం పథకానికి దరఖాస్తు చేసుకునే వారు వైఎస్ఆర్ లా నేస్తం వెబ్ సైట్ లో సర్టిఫికెట్ అప్ లోడ్ చేసుకోవచ్చని, అర్హులైన ఏ ఒక్కరూ కూడా మిస్ కాకూడదని ప్రతి పథకంలో ప్రభుత్వం అడుగులు వేస్తొందని చెప్పారు. అందుకే ఏడాదికి రెండు సార్లు పెడుతున్నామని తెలిపారు. ప్రతి ఒక్క అడ్వకేట్ ఈ ఒక్క మాట గుర్తు పెట్టుకోవాలని చెబుతూ ది వెపన్ ఆఫ్ ది అడ్వకేట్ ఈ దీస్ సోడ్ ఆఫ్ ది సోల్జర్.. నాట్ ది జాగర్ ఆఫ్ ది అససినెట్.. అంటే న్యాయవాది చేతిలో ఉన్న ఆయుధం.. సైనికుడి చేతిలో ఉండే తుపాకి వంటిదనీ, హంతకుడి చేతిలో ఉండే బాకు లాంటిది కాదని అన్నారు.

ఈ రోజు ప్రభుత్వం చేస్తున్న మంచిని గుర్తు పెట్టుకుని ఇదే అంకితభావంతో పేద వాడి పట్ల చూపాలని రిక్వెస్ట్ గా చెబుతున్నానన్నారు. న్యాయవాదులను ఆదుకునేందుకు వంద కోట్ల రూపాయలతో కార్పస్ ఫండ్ సైతం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. ఇందు కోసం అడ్వొకేట్ జనరల్ ఆధ్వర్యంలో న్యాయ, ఆర్ధిక శాఖ కార్యదర్శులు సభ్యులుగా ఓ ట్రస్ట్ ను ఏర్పాటు చేశామన్నారు. కోవిడ్ సమయంలో న్యాయవాదులను ఆదునేందుకు ఈ కార్పస్ ఫండ్ నుండి రూ.25 కోట్ల ను విడుదల చేశామనీ, న్యాయవాదులకు రుణం, భీమా, ఇతర వైద్య అవసరాల నిమిత్తం కార్పస్ ఫండ్ నుండి ఆర్ధిక సాయం పొందారని తెలిపారు.

క్యాసినో కింగ్ చీకోటి ప్రవీణ్ సంచలన కామెంట్స్ .. వారి నుండి తనకు ప్రాణ హాని ఉందంటూ..


Share

Related posts

చంద్రబాబుకు ఢిల్లీలో షాక్ .. కేశినేని వైఖరితో అవాక్కు

somaraju sharma

అనుష్క నిశ్శబ్దం : కళ్ళముందు బిగ్ రికార్డ్ సిద్ధంగా ఉంది .. బ్రేక్ చేయగలదా ?

GRK

బాబు నచ్చకే నిన్ను గెలిపించాం జగన్, మళ్లీ నువ్వు ఏంటి ఇలా…??

sekhar