AP CM YS Jagan: నిరుద్యోగులకు సీఎం జగన్ గుడ్ న్యూస్..! మెరిట్ ఆధారంగానే నియామకాలు..!!

Share

AP CM YS Jagan: ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోనరెడ్డి రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్ అందించారు. ఇకపై దళారులకు, పైరవీలకు తావు లేకుండా కేవలం మెరిట్ ఆధారంగానే నియామకాలు జరుగుతాయని సీఎం జగన్ వెల్లడించారు. ఈ ఆర్థిక సంవత్సరంలోనే 10,143 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు తెలిపారు. నేడు క్యాంప్ కార్యాలయంలో జాబ్ క్యాలెండర్ ను సీఎం జగన్ విడుదల చేశారు. మార్చి 2022 వరకూ భర్తీ చేసే ఉద్యోగాల వివరాలను ఇందులో ప్రకటించారు.

AP CM YS Jagan released job calendar
AP CM YS Jagan released job calendar

Read more: Mansas Trust: ప్రభుత్వం ఎందుకో తప్పటడుగు వేస్తుంది..! మన్సాస్ పై మరకలేల..!? ఇలా చేయొచ్చుగా..!?

ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగాల కోసం అభ్యర్థులు ఎళ్ల తరబడి శిక్షణ పొందుతూ ఎదురుచూస్తున్నారన్నారు. వాళ్లు మనోధైర్యం కోల్పోకుండా ఉండేందుకు ఉద్యోగాల భర్తీ చేస్తున్నామన్నారు. ఏ ఉద్యోగం ఏ నెలలో వస్తుందో తెలియజేసేందుకు క్యాలెండర్ విడుదల చేశామన్నారు. ఈ రెండేళ్ల కాలంలో ఏకంగా 6,03,701 ఉద్యోగాలను భర్తీ చేశామన్నారు. వీటిలో శాశ్వత ప్రాతిపదికన 1,84,264, పొరుగు సేవలు 3,99,791, ఒప్పంద ఉద్యోగాలు 19,701 ఇచ్చామన్నారు. రూ.3,500 కోట్ల భారం పడుతున్నా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి 51,387 మంది ఆర్టీసీ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించామన్నారు. రాష్ట్రానికి ఆదాయం తగ్గినా, ప్రతి కూల పరిస్థితుల్లోనూ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగిస్తున్నామని జగన్ వెల్లడించారు.

Read More: TDP MP Kanakamedala Ravindra Kumar: కేంద్రానికి టీడీపీ ఎంపి కనకమేడల కీలక లేఖ..! అది ఏమిటంటే..!!


Share

Related posts

Minister Buggana Rajendranath reddy: రాష్ట్ర మంత్రికి షాక్ ఇచ్చిన కేంద్ర భద్రతా సిబ్బంది..!సీఎంఒకు ఫిర్యాదు..!?

somaraju sharma

KCR : ఒళ్లు దగ్గర పెట్టుకోకుంటే దుమ్ము దుమ్మే:కమలనాథులకు కెసిఆర్ వార్నింగ్ మామూలుగా లేదుగా?

Yandamuri

నాని మాత్రం ఆగలేదట ..!

GRK