AP CM YS Jagan: చిరు వ్యాపారులకు రూ.370 కోట్లు విడుదల చేసిన సీఎం వైఎస్ జగన్

Share

AP CM YS Jagan: ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి సంక్షేమ పథకాలను యథావిధిగా కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో భాగంగా జగనన్న తోడు పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల 70 వేల మంది చిరు వ్యాపారులకు పది వేల రూపాయల చొప్పున రూ.370 కోట్లను సీఎం జగన్ మంగళవారం విడుదల చేశారు.  తాడేపల్లి లోని తన క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ కంప్యూటర్ బటన్ నొక్కి నేరుగా లబ్దిదారుల ఖాతాలో నగదు జమ చేశారు.

AP CM YS Jagan releases jagananna thodu loan amount beneficiary accounts
AP CM YS Jagan releases jagananna thodu loan amount beneficiary accounts

ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ చిరు వ్యాపారులకు మేలు చేసేందుకే ఈ కార్యక్రమం చేపట్టామని అన్నారు. తాను పాదయాత్ర చేసిన సమయంలో చిరు వ్యాపారుల కష్టాలు చూశాననీ, అందు కోసమే వారి కోసం ప్రత్యేకంగా జగనన్న తోడు పథకం ద్వారా వడ్డీ లేని రుణాలు అందిస్తున్నామని వెల్లడించారు.

Read More: Anandaiah medicine: ఏపి సీఎం వైఎస్ జగన్‌కు ఆనందయ్య లేఖ..! మేటర్ ఏమిటంటే..!!

గత ఏడాది తొలి విడతలో 5.35 లక్షల మందికి రుణ సౌకర్యం కల్పించామనీ, ఇప్పుడు రెండో విడతలో 3.7 లక్షల మందికి వడ్డీ లేని రుణాలు అందించామన్నారు. మొత్తంగా ఇప్పటి వరకూ 9 లక్షల 5వేల మంది చిరు వ్యాపారులు ఈ పథకం ద్వారా లబ్దిపొందారన్నారు. గ్రామాలు, పట్టణాల్లో చిరు వ్యాపారాలు చేసుకునే వారందరికీ ఈ పథకం కింద లబ్ది చేకూరుతోందనీ, అర్హత ఉన్న వారందరికీ సాయం చేస్తున్నామన్నారు.

Read More: YS Jagan: అప్పుడు రద్దు అన్న శాసనమండలే ఇప్పుడు జగన్ కు ముద్దు!!మరి సీఎం అవసరాలు అలాంటివి!!


Share

Related posts

నాకు ఎంత అప్పు ఉందో లెక్కలేసుకోవడానికి కూడా భయమేసింది: నాగబాబు

Varun G

వామ్మో.. ఇది కలా? నిజమా? బిగ్ బాస్ హారికకు ఇంత క్రేజా?

Varun G

ములుగు కలుగులో ఉద్యమ అడుగులు

Special Bureau