NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP CM YS Jagan: ఎయిడెడ్ విద్యాసంస్థల యాజమాన్యాలకు సీఎం జగన్ గుడ్ న్యూస్..!!

AP CM YS Jagan:  ఏపి (Andhra Pradesh) విద్యా వ్యవస్థలో సంస్కరణల నేపథ్యంలో ఎయిడెడ్ విద్యాసంస్థల (Aided educational institutions) ను ప్రభుత్వం (AP Govt) స్వాధీనం చేసుకుని నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్న సంగతి తెలిసిందే. ఎయిడెడ్ పాఠశాలల గ్రాంట్ ఇన్ ఎయిడ్ నిలుపుదలకు ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీనిపై పలు ఎయిడెడ్ విద్యాసంస్థల యాజమాన్యాలు హైకోర్టును ఆశ్రయించాయి. ఎయిడెడ్ విద్యాసంస్థల భూముల విలువ రూ. లక్షలు, కోట్లలో ఉండటంతో వారు ప్రభుత్వానికి స్వాధీనం చేయడానికి సుముఖత వ్యక్తం చేయడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యాశాఖ అధికారులు ఎయిడెడ్ విద్యాసంస్థలకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరించారు.

AP CM YS Jagan review meeting higher education
AP CM YS Jagan review meeting higher education

ఎయిడెడ్ విద్యాసంస్థల వివరాల సేకరణ

అందులో ప్రధానంగా పాఠశాల నడిపే ప్రదేశం. ఎప్పటి నుండి పని చేస్తోంది. కరస్పాండెంట్, అక్కడ పని చేస్తున్న బోధన బోధనేతర ఉద్యోగుల వివరాలు, వాటిల్లో శాంక్షన్ పోస్టులు, వారికి చెల్లిస్తున్న జీత భత్యాలు, పిల్లల ప్రవేశాలు, అది మైనార్టీ విద్యాసంస్థ. నాన్ మైనార్టీ విద్యాసంస్థా అనేవి సేకరించారు. అదే విధంగా విద్యాసంస్థలో మౌలిక సదుపాయాలు, ప్రస్తుతం భవనాల పరిస్థితి ఎలా ఉంది, పాఠశాలలో ఎన్ని తరగతులు ఎయిడెడ్ లో నడుస్తున్నాయి. భవనాలకు చెల్లిస్తున్న అద్దెలు, కరెంటు బిల్లు, ప్రయోగశాలలో పరిరకాల వివరాలు, పాఠశాల భూమికి సంబంధించి విలువ తదితర వివరాలను విద్యాశాఖ అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. ప్రభుత్వ నిర్ణయంతో ఎయిడెడ్ విద్యాసంస్థల యాజమాన్యాలు ఆందోళన చెందుతున్నాయి. స్వచ్చందంగా అప్పగించడానికి కొన్ని విద్యాసంస్థలు ముందుకు వస్తున్నాయి. అయితే స్వచ్చందంగా విద్యాసంస్థలు అప్పగించడానికి ఎంత మంది సుముఖత వ్యక్తం చేస్తున్నారు అనే వివరాలను కూడా విద్యాశాఖ అధికారులు సేకరించారు.

AP CM YS Jagan:  విద్యాసంస్థల అప్పగింతలో బలవంతం లేదు

ఈ నేపథ్యంలో సోమవారం విద్యాశాఖపై నిర్వహించిన సమీక్షలో సీఎం వైఎస్ జగన్(CM YS Jagan)  కీలక వ్యాఖ్యలు చేశారు. ఎయిడెడ్ విద్యాసంస్థల అప్పగింతలో ఎలాంటి బలవంతం లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వానికి అప్పగించడం అన్నది పూర్తి స్వచ్చందం అని తెలిపారు. శిధిలావస్థలో, మౌలిక సదుపాయలు లేక విద్యార్ధులు, సిబ్బంది చాలా ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇలాంటి వారికి ఒక అవకాశం ప్రభుత్వ పరంగా కల్పించామన్నారు. ప్రభుత్వానికి అప్పగిస్తే ఆయా సంస్థలను ప్రభుత్వమే నిర్వహిస్తుందన్నారు. లేదు తామే నడుపుకుంటామంటే బేషుగ్గా నడుపుకోవచ్చని, దీనికి ఎలాంటి అభ్యంతరం లేదని సీఎం జగన్ స్పష్టం చేశారు. ప్రభుత్వానికి ఎయిడెడ్ విద్యాసంస్థల అప్పగింతలో ఎలాంటి బలవంతం లేదని అందరికీ స్పష్టం చేయాలని అధికారులకు సీఎం ఆదేశించారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju