AP CM YS Jagan: 8వ తరగతి విద్యార్ధులకు గుడ్ న్యూస్..ఏపీ సీఎం వైఎస్ జగన్ కీలక ఆదేశాలు

Share

AP CM YS Jagan: ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి మంగళవారం విద్యాశాఖలో నాడు – నేడు, డిజిటల్ లెర్నింగ్ పై సమీక్ష జరిపారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ సమీక్షలో అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. బైజూస్ తో ఒప్పందం జరిగిన దృష్ట్యా విద్యార్ధులకు అందించే కంటెంట్ పై అధికారులతో చర్చించారు. 8వ తరగతి విద్యార్ధులకు సెప్టెంబర్ నెలలో అందించే ట్యాబ్ లపై సమీక్షించారు. తరగతి గదుల్లో డిజిటల్ స్క్రీన్ల ఏర్పాటుపై కార్యాచరణ చేపట్టాలని అధికారులన ఆదేశించారు. ఎనిమిదవ తరగతి విద్యార్ధులకు ట్యాబ్ లు అందజేయాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నామని చెప్పిన సీఎం జగన్.. సెప్టెంబర్ నెలలో ట్యాబ్ లు పంపిణీ చేస్తామన్నారు. ఆ ట్యాబ్ ల్లో బైజూస్ కంటెంట్ ను లోడ్ చేయాలని తెలిపారు. దానికి తగినట్లుగా ట్యాబ్ స్పెసిఫికేషన్స్, ఫీచర్లు ఉండే విధంగా చూడాలని, అవి నిర్ధారించుకున్న తరువాతే ట్యాబ్ లు కొనుగోలు ప్రక్రియ ప్రారంభించాలని సీఎం జగన్ తెలిపారు.

AP CM YS Jagan Review meeting on digital learning in schools

ప్రధానంగా టెండర్లు పిలిచే సమయంలో నాణ్యత, డ్యూరబులటీని దృష్టిలో ఉంచుకోవాలని జగన్ సూచించారు. ఎనిమిదవ తరగతిలో విద్యార్ధులకు అందించే ట్యాబ్ లు ఆ తరువాత వారు 9,10 తరగతుల్లో కూడా పని చేసే విధంగా ఉండాలనీ, అందుకే నిర్వహణ కూడా అత్యంత ముఖ్యమని చెప్పారు. ఏదైనా సమస్య వస్తే వెంటనే రిపేరు చేసే అంశాన్ని కూడా దృష్టిలో ఉంచుకోవాలని అధికారులకు తెలిపారు. మంచి కంపెనీల నుండి ట్యాబ్ లు తీసుకోవాలనీ, నిర్ణేశిత సమయంలోగా ట్యాబ్ లు విద్యార్ధులకు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు సీఎం జగన్. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సమీర్ శర్మ, పాఠశాల విద్యాశాఖ స్పెషల్ సీఎస్ బుడితి రాజశేఖర్, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్ సురేష్ కుమార్ తదితరులు ఈ సమీక్షలో పాల్గొన్నారు.


Share

Recent Posts

బీహార్ సీఎంగా 8వ సారి నితీష్ కుమార్ …ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఫిక్స్

బీహార్ ముఖ్యమంత్రిగా జేడీయూ నేత నితీష్ కుమార్ 8వ సారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటి వరకూ నితీష్ కుమార్ ఏడు సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం…

1 min ago

స‌మ్మె ఎఫెక్ట్‌.. ప్ర‌భాస్‌కు అన్ని కోట్లు న‌ష్టం వ‌చ్చిందా?

గ‌త కొద్ది నెల‌ల నుండి సినిమాల ద్వారా వ‌చ్చే ఆదాయం బాగా త‌గ్గిపోవ‌డం, నిర్మాణ వ్య‌యం మోయ‌లేని భారంగా మార‌డంతో.. తెలుగు సినీ నిర్మాతలు త‌మ స‌మ‌స్య‌ల‌ను…

53 mins ago

బీజేపీకి మరో సారి షాక్ ఇచ్చిన బీహార్ సీఎం నితీష్ కుమార్ .. సీఎం పదవికి రాజీనామా

జేడీయూ నేత, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మిత్రపక్షమైన బీజేపీకి మరో సారి షాక్ ఇచ్చారు. ఎన్డీఏ నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన నితీష్ కుమార్ ఇప్పటి వరకు…

2 hours ago

ర‌ష్మిక నో చెప్పాక కృతి శెట్టి న‌టించిన‌ సినిమా ఏదో తెలుసా?

యంగ్ బ్యూటీ కృతి శెట్టి గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. త‌క్కువ స‌మ‌యంలోనే టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్‌గా మారిన ఈ ముద్దుగుమ్మ‌.. త్వ‌ర‌లోనే `మాచర్ల నియోజవర్గం`తో ప్రేక్ష‌కుల‌ను…

2 hours ago

స్ట్రీమింగ్‌కు సిద్ధ‌మైన న‌య‌న్‌-విగ్నేష్ పెళ్లి వీడియో.. ఇదిగో టీజ‌ర్!

సౌత్‌లో లేడీ సూప‌ర్ స్టార్‌గా గుర్తింపు పొందిన న‌య‌న‌తార ఇటీవ‌లె కోలీవుడ్ ద‌ర్శ‌క‌,నిర్మాత విఘ్నేష్ శివ‌న్‌ను పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టింది. దాదాపు ఆరేళ్ల…

3 hours ago

కడుపు ఉబ్బరం సమస్యకు ఇలా చెక్ పెట్టేయండి..!

ఆహారం లేకుండా జీవించాలంటే చాలా కష్టం.ఆహా అయితే ఒక రెండు మూడు రోజులు ఉండగలం. కానీ ఆహారం లేకుండా మాత్రం మనిషి మనుగడ లేదు.గుప్పెడు అన్నం మెతుకుల…

3 hours ago