29.2 C
Hyderabad
March 28, 2023
NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

ఆదాయార్జనలో ఏపి పరిస్థితి ఇలా .. సీఎం వైఎస్ జగన్‌ సమీక్షలో అధికారులు చెప్పిన లెక్కలు ఇవి

AP CM YS Jagan review meeting on revenue earning departments
Share

ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో గురువారం ఆదాయాన్నిచ్చే శాఖలపై సమీక్ష జరిపారు. కోవిడ్‌ పరిస్థితులను దాటుకుని ఆదాయాలు గాడిలో పడుతున్నాయని అధికారులు వివరించారు. లక్ష్యాలకు దగ్గరగా ఆదాయాలు ఉన్నాయన్న తెలిపారు. డిసెంబర్‌ 2022 వరకూ జీఎస్టీ వసూళ్లలో దేశ సగటు 24.8 శాతం. ఏపీలో వసూళ్లు 26.2 శాతం, తెలంగాణ (17.3శాతం), తమిళనాడు (24.9 శాతం), గుజరాత్‌ (20.2శాతం) కన్నా మెరుగైన వసూళ్లు ఉన్నట్టుగా వెల్లడించారు అధికారులు. జీఎస్టీ వసూళ్లు 2022 జనవరి నాటికి రూ. 26,360.28కోట్లు ఉంటే, 2023 జనవరి నాటికి రూ. 28,181.86 కోట్లు వసూళ్లు వచ్చాయని, గత ఏడాది ఇదే కాల పరిమితితో పోల్చుకుంటే 6.91 శాతం పెరుగుదల కనిపించిందని అధికారులు తెలిపారు.

AP CM YS Jagan review meeting on  revenue earning departments
AP CM YS Jagan review meeting on revenue earning departments

 

జీఎస్టీ, పెట్రోలు, ప్రొఫెషనల్‌ ట్యాక్స్, ఎక్సైజ్‌ ఆదాయాలను కలిపి చూస్తే జనవరి 2023 నాటికి ఆదాయాల లక్ష్యం రూ. 46,231 కోట్లు కాగా, రూ.43,206.03 కోట్లకు చేరుకున్నామని వివరించారు. దాదాపు 94శాతం లక్ష్యాన్ని సాధించినట్టు అధికారులు తెలిపారు. గతంలో సీఎం ఇచ్చిన ఆదేశాల మేరకు పన్ను వసూలు యంత్రాంగంలో కీలక మార్పులు తీసుకువచ్చామని అధికారులు తెలిపారు. పన్ను చెల్లింపు దారులకు సౌలభ్యమైన విధానాల ద్వారా ఆదాయాలు మెరుగు పడుతున్నాయని చెప్పారు. విధానాలను సరళీకరించుకోవడం వల్ల మంచి ఫలితాలు వస్తున్నాయన్నారు. డేటా అనలిటిక్స్‌ వల్ల వసూళ్లు మెరుగుపడుతున్నాయని తెలిపారు. సిబ్బందికి శిక్షణ, వారి సమర్థతను మెరుగు పరుచుకుంటున్నామని వెల్లడించారు. టాక్స్‌ అసెస్మెంట్‌ను ఆటోమేటిక్‌ పద్ధతుల్లో అందించే వ్యవస్థను నిర్మించుకున్నామని, దీని వల్ల పన్ను చెల్లింపుదారులకు మరింత సులభంగా సేవలు అందిస్తున్నామని తెలిపారు. డివిజన్‌ స్ధాయిలో కేంద్రీకృత రిజిస్ట్రేషన్‌ యూనిట్లు ఏర్పాటు చేశామని చెప్పారు. పన్ను చెల్లింపుదారులకు పారదర్శకత పద్ధతులను అందుబాటులో ఉంచామని వెల్లడించారు.

ఏపీ కన్నా మెరుగైన పని తీరు కనబరుస్తున్న రాష్ట్రాల్లో విధానాలను అధికారులు అధ్యయనం చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. తద్వారా మంచి విధానాలను రాష్ట్రంలో అమలు చేయాలని చెప్పారు. గనులు–ఖనిజ శాఖలో ఈ ఆర్ధిక సంవత్సరంలో ఫిబ్రవరి 6 వరకూ రూ.3,649 కోట్ల ఆర్జన కాగా నిర్దేశించుకున్న లక్ష్యాన్ని నూటికి నూరుశాతం చేరుకున్నామన్న అధికారులు తెలిపారు. గత ఆర్థిక సంవత్సరం ఫిబ్రవరి 6 నాటికి రూ.2,220 కోట్లు రాగా, నిర్దేశించుకున్న రూ.5వేల కోట్ల ఆదాయ లక్ష్యాన్ని దాదాపుగా చేరుకుంటామన్న అధికారులు ఆశాభావం వ్యక్తం చేసారు. ఆపరేషన్‌లో లేని గనులను ఆపరేషన్‌లోకి తీసుకొచ్చేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు. రవాణా శాఖలో ఈ ఆర్థిక సంవత్సరంలో జనవరి నాటికి లక్ష్యంగా రూ.3,852.93 కోట్లు కాగా, రూ.3,657.89 కోట్లకు చేరుకున్నామని అధికారులు తెలిపారు. కోవిడ్‌ లాంటి పరిస్థితులు పూర్తిగా పోయి, పరిస్థితులు నెమ్మదిగా గాడిలో పడుతున్నాయని అధికారులు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఉన్న ఎర్రచందనం నిల్వలను విక్రయించడానికి అన్నిరకాల చర్యలు తీసుకున్నామనీ, మూడు దశల్లో విక్రయానికి అన్నిరకాల ఏర్పాట్లు చేస్తున్నామనీ అధికారుల వెల్లడించారు.

 


Share

Related posts

Custard Apple: సీతాఫలం పండే కాదు ఆకులతో కూడా బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు..!!

bharani jella

జగన్ ప్రభుత్వానికి మరో ట్విస్ట్ : టోల్ పై లారీ యజమానులు గరంగరం

Special Bureau

మోదీ అంటే ప‌వ‌న్‌కు ఎలాంటి ఫీలింగ్ ఉందో తెలుసా?

sridhar