NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP CM YS Jagan: కోవిడ్‌పై సమీక్ష ..కీలక ఆదేశాలు జారీ చేసిన సీఎం వైఎస్ జగన్..!!

AP CM YS Jagan: రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి సోమవారం కోవిడ్ నియంత్రణ, నివారణ, వ్యాక్సినేషన్ తదితర అంశాలపై సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా కోవిడ్ స్పెషల్ ఆఫీసర్ లు, ట్రాన్స్ పోర్టు బృందాలకు కీలక సూచనలు చేశారు. 104 వ్యవస్థ మరింత బలోపేతం కావాలని సూచించారు. అధికారులు నిత్యం మాక్ కాల్స్ చేసి పనితీరును పర్యవేక్షించాలని ఆదేశించారు. కేసులు అధికంగా ఉన్న జిల్లాల్లో బెడ్స్ సంఖ్యను పెంచాలన్నారు. ఆక్సిజన్ తో సహా కావాల్స్న మౌలిక సదుపాయాలు అన్నీ కల్పించాలని ఆదేశించారు.

AP CM YS Jagan review on covid 19
AP CM YS Jagan review on covid 19

104 కు కాల్ చేస్తే జాప్యం జరగకుండా త్వరితగతిన స్పందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. 104కు కాల్ చేసే కరోనా బాధితులకు కఛ్చితంగా సాయం అందాలని జగన్ ఆదేశించారు. 104 కు కాల్ చేస్తే స్పందన లేదంటూ ఇటీవల ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో సీఎం జగన్ దీనిపై సీరియస్ గా ఆదేశాలు ఇచ్చారు. 104 కు కాల్ చేస్తే ఫోన్ కలవలేదనీ గానీ, స్పందన లేదన్న మాట ఎక్కడా వినిపించకూడదని తెలిపారు. ప్రతి హాస్పటల్ లో ఆరోగ్యమిత్ర విధిగా ఉండాలన్నారు. బెడ్ అవసరం లేదు అన్నవారికి కోవిడ్ కేర్ సెంటర్లకు పంపించాలని సీఎం జగన్ ఆదేశించారు.

వ్యాక్సిన్ కేంద్రాల వద్ద రద్దీ, తోపులాట కనిపించకూడదన్నారు. ప్రస్తుతం నెలకు 19లక్షలకు పైగా డోసులే వస్తున్నాయనీ, వ్యాక్సిన్ల కొనుగోలుపై గ్లోబల్ టెండర్ వెళ్లడంపై ఆలోచించాలన్నారు. దీనిపై ఆలోచించి అధికారులు నిర్ణయం తీసుకోవాలని ఆదేశించారు.  ఏ రాష్ట్రానికి ఎన్ని వ్యాక్సిన్ లు విక్రయించాలనే విషయాన్ని కేంద్రమే నిర్ణయిస్తోందని సీఎం పేర్కొన్నారు. కేంద్రం నిర్ణయించిన కోటా మేరకు వ్యాక్సిన్ కొనుగోలు చేయాల్సి ఉంటుందని, అది కూడా డబ్బును ముందుగా చెల్లించాల్సి ఉంటుందని అన్నారు వ్యాక్సిన్ ఎవరికి వేస్తారనేది ఆశా వర్కర్లు, ఎఎన్ఎంలు చెప్పాలని స్పష్టం చేశారు.

45 ఏళ్లు పైబడిన వారికి రెండో డోస్ అందేలా చూడాలని సూచించారు. రెమ్‌డెసివిర్ ఇంజక్షన్ లు బ్లాక్ మర్కెట్ లో అమ్మకుండా చూడాలన్నారు. ఈ ఇంజక్షన్ల వినియోగంపై ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆడిటింగ్ ఉండాలన్నారు. రాష్ట్రంలో కర్ఫ్యూ అమలుతీరుపై ప్రతి జిల్లా నుండి ప్రతి రోజు నివేదిక ఇవ్వాలని డీజీపీని ఆదేశించారు. అన్ని జిల్లాల్లో ప్రతి బుధవారం కోవిడ్ రివ్యూ కమిటీలు సమావేశం కావాలని సీఎం సూచించారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!

ఆ వైసీపీ నాయ‌కుడికి మేం జై కొట్ట‌లేం… కూట‌మి ప్ర‌యోగం విక‌టిస్తోందా..?

వైసీపీ స‌ర్వేల్లోవైసీపీ స‌ర్వేల్లోనూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?నూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?

చంద్ర‌గిరిలో ర‌స‌వ‌త్త‌ర పోరు.. చెవిరెడ్డి వార‌సుడి స‌క్సెస్ రేటెంత‌..!